Indian Railway: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. అవసరాలను బట్టి కోచ్ మొత్తాన్ని ఇంకా జనాలు ఎక్కువగా ఉంటే రైలు మొత్తాన్ని బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి పెళ్లిళ్లు, టూర్లకు వెళ్లాలి అనుకుంటే మొత్తం కోచ్ ను లేదంటే కోచ్ లను ఇంకా జనాలు ఎక్కువగా ఉంటే మొత్తం రైలును బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు రైల్వే స్టేషన్ కు వెళ్లి కౌంటర్ లో మొత్తం ప్రయాణానికి సంబంధించి ఒకే టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ లైన్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కోచ్ మొత్తాన్ని ఎలా బుక్ చేసుకోవాలంటే?
పెళ్లిళ్లు లేదంటే కంపెనీ ఉద్యోగుల మీటింగ్ లాంటి సమయంలో ఒకేసారి మొత్తం కోచ్ లేదంటే రెండు, మూడు కోచ్ లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఎక్కువ మంది ఒకేసారి రైల్వే ప్రయాణం చేయాల్సిన సందర్భంలో ఈ సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది. ఒక రైలు కోచ్ ను మొత్తాన్ని బుక్ చేసుకోవాలంటే ముందుగా IRCTCకి చెందిన FTR వెబ్ సైట్ www.ftr.irctc.co.inను ఓపెన్ చేయాలి. యూజర్ ఐడీతో లాగిన్ కావాలి. మీరు కోచ్, లేదంటే రైలును బుక్ చేసుకునే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఏది కావాలంటే దానిపై ట్యాప్ చేయాలి. మీ ప్రయాణానికి సంబంధించి పూర్తి వివరాలను అందులో ఎంటర్ చేయాలి. ప్రయాణం చేయాల్సిన డేట్, కోచ్ కు సంబంధించిన వివరాలను అందివ్వాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. మీకు మొత్తం కోచ్ బుక్ చేయబడుతుంది. మొత్తం కోచ్ ను బుక్ చేసే సమయంలో ప్రతి ప్రయాణీకుడి వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కోచ్ ఒకే వ్యక్తి పేరు మీద బుక్ చేయబడుతుంది.
35 శాతం ఎక్కువ ఛార్జ్.. రూ. 50 వేల సెక్యూరిటీ డిపాజిట్
ఇక మీరు రైలులోని ఓ కోచ్ పూర్తిగా బుక్ చేసుకుంటే సాధారణ ఛార్జ్ తో పోల్చితే 30 నుంచి 35 శాతం ఛార్జ్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రూ. 50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ డబ్బులను తిరిగి చెల్లిస్తారు.
Read Also: అమెరికాలో అద్భుతమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కాకండి!
రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే?
అవసరాన్ని బట్టి మొత్తం రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఛార్జ్ వసూళు చేస్తారు. జనరల్ గా ఒక రైలులో 18 కోచ్ లు ఉంటాయి. ఈ కోచ్ లు అన్నింటి ఛార్జ్ తో పాటు రైలు ఇంజిన్ ఛార్జ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ ప్రయాణీకులతో పోల్చితే ప్రత్యేకంగా రైలు బుక్ చేసుకున్న వారు ఎక్కువగా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: ఈ దేశాల్లో మన కరెన్సీ చాలా ఖరీదు, ఒక్క రూపాయి విలువ అక్కడ ఎంత అంటే?