Indian Railways: తాగుబోతులు చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. పీకలదాకా దాకా తాగి రోడ్డు మీద వాహనాలు నడుపుతున్నామనే సోయి ఉండదు. తాజాగా ఓ తాగుబోతు రాయుడు ఏకంగా కారును రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారమ్ మీదికి ఎక్కించాడు. ఆ సమయంలో స్టేషన్ లో రైలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్నాటకలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టికెట్ కౌంటర్ మెట్ల మీది నుంచి నేరుగా ప్లాట్ ఫారమ్ మీదికి..
ఫుల్ గా తాగి నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి తన కారుతో రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లిన ఘటన కర్ణాటకలోని కోలార్ లో జరిగింది. టేకల్ రైల్వే స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన చూసి ఒక్కసారిగా ప్రయాణీకులు షాక్ అయ్యారు. డ్రైవర్ బాగా తాగి ఉండటంతో స్టేషన్ సమీపంలోకి రాగానే కారు కంట్రోల్ తప్పింది. మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు నేరుగా రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వైపు దూసుకెళ్లింది. మెట్ల మీది నుంచి వేగంగా పైకి ఎక్కింది. అటు నుంచి నేరుగా రైల్వే ప్లాట్ ఫారమ్ మీదికి దూసుకొచ్చింది. ఫ్లాట్ ఫారమ్ మీది నుంచి ట్రాక్ మీద పడింది.
ఒక్కసారిగా షాకైన ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది
ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లోని సిబ్బంది, ప్రయాణీకులు షాక్ అయ్యారు. అచ్చం సినిమాల్లో జరిగే స్టంట్ లాంటి ఘటన నిజ జీవితంలో చూసి భయంతో వణికిపోయారు. వెంటనే రైల్వే సిబ్బంది రియాక్ట్ అయ్యారు. జేసీబీని రప్పించి ట్రాక్ మీద పడిపోయిన కారును బయటకు తీయించారు. రైల్వే ఫ్లాట్ ఫారమ్ నుంచి స్టేషన్ బయటకు లాక్కెల్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. కారును నడిపిన రాకేష్ అనే వ్యక్తి విపరీతమైన మద్యం తాగినట్లు గుర్తించినట్లు తెలిపారు.
स्टेशन पर चढ़ाई कार और फिर उतार दी ट्रैक पर, ड्राइवर का हाल देख लोगों ने पकड़ा माथा
बीते शनिवार देर रात कर्नाटक के कोलार के टेकल रेलवे स्टेशन पर एक चौंकाने वाली घटना सामने आई. यहां नशे में धुत्त एक व्यक्ति ने अपनी कार सीधे रेलवे स्टेशन परिसर में घुसा दी. पहले उसने कार को… pic.twitter.com/nqPyvCt6no
— AajTak (@aajtak) February 3, 2025
Read Also: లోకో పైలెట్ నుంచి టీటీఈ వరకు.. పూర్తి మహిళా సిబ్బందితో పరుగులు తీసిన ఎక్స్ ప్రెస్ రైలు!
రైళ్లు లేకపోవడంతో తప్పిన పెను ముప్పు
వాస్తవానికి ఈ టేకల్ రైల్వే స్టేషన్ చాలా బిజీగా ఉంటుంది. నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు కొనసాగుతుంటాయి. అయితే, కారు ట్రాక్ మీదికి దూసుకొచ్చిన సమయంలో ఎలాంటి రైళ్లు లేవు. ఒకవేళ రైలు ఉండి ఉంటే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగేదని అధికారులు వెల్లడించారు. నిందితుడి ప్యాసింజర్లు తీసుకెళ్లేందుకు స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిపూ రైల్వేకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిపారు.
Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు.. ఒక్కో స్టేషన్ నుంచి ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?
Read Also: లోకో పైలెట్ తిరకాసు, మధ్యలోనే నిలిచిపోయిన కుంభమేళా రైలు!