E-Paper
Advertisement

PNR స్టేటస్ To ఫుడ్ ఆర్డర్.. ఇక అన్ని సర్వీసులు వాట్సాప్‌లోనే!

PNR స్టేటస్ To ఫుడ్ ఆర్డర్.. ఇక అన్ని సర్వీసులు వాట్సాప్‌లోనే!
Advertisement

IRCTC WhatsApp Chatbot: రైలు ప్రయాణీకులకు సౌకర్యాలు మరింత సులభంగా అందించేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం IRCTC కొత్త వాట్సాప్ చాట్‌ బాట్ సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా ప్రయాణికులు తమ రైలు సంబంధిత సమాచారం కోసం వేరే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వాట్సాప్‌లోనే అన్ని వివరాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ చాట్‌ బాట్‌ ను రైలోఫీ అనే స్టార్టప్‌ తో కలిసి డెవలప్ చేసింది.

కొత్త ఫీచర్ తో కలిగే లాభం ఏంటి?

ఈ కొత్త ఫీచర్ వల్ల ప్రయాణికులకు చాలా సౌలభ్యం కలుగుతుంది. సాధారణంగా రైలు స్టేటస్, PNR వివరాలు తెలుసుకోవడానికి  వెబ్‌ సైట్లు లేదంటే యాప్‌ లను ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు, ఒకే ప్లాట్‌ ఫారమ్‌ లో అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త సర్వీసును ఎలా ఉపయోగించాలంటే?

Advertisement

ఈ చాట్‌ బాట్‌ ను ఉపయోగించడం చాలా సులభం. మొబైల్‌ లో రైలోఫీ వాట్సాప్ నంబర్‌ ను సేవ్ చేసి, చాట్ ఓపెన్ చేసి మీ 10 అంకెల PNR నంబర్‌ ను పంపించాలి. వెంటనే మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. ఇందులో PNR స్టేటస్, రైలు ప్రస్తుతం ఎక్కడ ఉంది? ముందు వెళ్లిన స్టేషన్లు, వచ్చే స్టేషన్ల లాంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఫుడ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు..

అంతేకాదు, ఈ చాట్‌బాట్ ద్వారా రైలులో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణంలో ఎక్కడ భోజనం చేయాలో ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. మీ సీటు దగ్గరే ఫుడ్ డెలివరీ పొందే అవకాశం ఉంటుంది. ఈ సర్వీసు సుదూర ప్రయాణాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ చాట్‌ బాట్ ద్వారా ప్రయాణానికి ముందుగానే అప్డేట్స్ పొందవచ్చు. రైలు ఆలస్యం, ప్లాట్‌ ఫామ్ మార్పులు, ఇతర ముఖ్యమైన సమాచారం గురించి ముందుగానే తెలియజేస్తుంది. దీనివల్ల ప్రయాణికులు ముందస్తుగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.

Advertisement

అటు ఈ సర్వీసుతో పాటు రైల్వే హెల్ప్‌ లైన్ నంబర్ 139 ద్వారా కూడా ప్రయాణికులు సమాచారం పొందవచ్చు. అయితే వాట్సాప్ చాట్‌ బాట్ మరింత సులభంగా, వేగంగా పని చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పటికే వాట్సాప్‌ ను ఉపయోగిస్తున్నారు. మొత్తంగా ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన తాజా సర్వీసు  వినియోగదారులకు మరింత లాభం కలిగించనుంది. ఒకే చోట అన్ని వివరాలు అందించడం వల్ల ప్రయాణికులు ఈజీగా అసవరమైన సమాచారం పొందే అవకాశం ఉంటుంది. టెక్నాలజీకి అలవాటు పడిన యువతకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటే, ఈ వాట్సాప్ చాట్‌ బాట్‌ ను తప్పకుండా ఉపయోగించుకోండి.

Read Also: విమానంలా రైల్లో సీటు సెలెక్షన్ ఉండదు, కారణం ఏంటంటే?

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×