Indian Railways: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించి మరొక ఎడిషన్ ను ప్రకటించింది. శ్రీ రామాయణ యాత్ర పేరుతో శ్రీ రామచంద్ర స్వామి జీవితానికి సంబంధించి 30 కంటే ఎక్కువ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు తీసుకెళ్లేలా ఈ టూర్ ను ప్లాన్ చేసింది. మొత్తం 17 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.
రామాయణ యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం?
IRCTC రామాయణ యాత్ర జూలై 25, 2025 నాడు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలులో భక్తులు బయల్దేరుతారు. ఈ రైలు ఆధునిక సౌకర్యాలు, అన్ని రకాల భోజన సదుపాయం, 3-స్టార్ బసతో పాటు ప్రతి కోచ్ లో ఫుట్ మసాజర్లు, CCTV భద్రతను కలిగి ఉంటుంది.
IRCTC రామాయణ యాత్ర గురించి..
రామాయణ యాత్రకు దేశంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన అయోధ్య నుంచి రామేశ్వరం వరకు, నేపాల్ లోని జనక్ పూర్ వరకు కవర్ చేస్తుంది. ముఖ్యంగా అయోధ్య రామ మందిరం దేశంలో ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారడంతో ఈ ప్రయాణం మరింత అద్భుతంగా ఉండబోతోంది.
యాత్రలో సందర్శించే రామాయణ ప్రదేశాలు
⦿ ఉత్తరప్రదేశ్: అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కి పైడి
⦿ నందిగ్రామ్: భారత్ మందిర్
⦿ సీతామర్హి, బీహార్ + జనక్ పూర్, నేపాల్: సీత, రామ్ జానకీ జన్మస్థలం
⦿ బక్సర్: రామరేఖ ఘాట్, రామేశ్వరనాథ్ ఆలయం
⦿ వారణాసి: కాశీ విశ్వనాథ్ కారిడార్, సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం, గంగా హారతి
⦿ ప్రయాగ్‌రాజ్, శృంగవర్ పూర్, చిత్రకూట్: రాముని వనవాస యాత్రతో ముడిపడి ఉన్న పవిత్ర స్థలాలు
⦿ నాసిక్: త్రయంబకేశ్వర దేవాలయం, పంచవటి
⦿ హంపి: కిష్కింధ, హనుమాన్, విట్టల మరియు విరూపాక్ష దేవాలయాల జన్మస్థలం
⦿ రామేశ్వరం: రామనాథస్వామి ఆలయం, రామసేతు సమీపంలో ధనుష్కోడి
రామాయణ యాత్ర రైలు ప్యాకేజీ ధర
రామాయణ యాత్రకు సంబంధించిన భోజనం, వసతి, సందర్శన, ప్రయాణ బీమాను కలిపి ప్యాకేజీ ధర ఉంటుంది.
⦿ ఒక వ్యక్తికి రూ. 1,17,975 – 3 AC
⦿ రూ. 1,40,120 – 2 AC
⦿ రూ. 1,66,380 – 1 AC క్యాబిన్
⦿ రూ. 1,79,515 – 1 AC కూపే
Read Also: 600 రైళ్లు 1200కు పెంపు.. అదిరిపోయే న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి!
భారత్ గౌరవ్ డీలక్స్ రైలు ప్రత్యేకత
⦿ ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లను (1వ, 2వ, 3వ AC) కలిగి ఉంటుంది.
⦿ రెండు రెస్టారెంట్లు + ఆధునిక వంటగది
⦿ షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు
⦿ ఫుట్ మసాజర్లు, ఆన్ బోర్డ్ భద్రత, CCTV నిఘా
⦿ ఆన్‌బోర్డ్ IRCTC టూర్ మేనేజర్లు ఉంటారు.
రామాయణ యాత్ర ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్రికులు టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే IRCTC అధికారులు తెలిపారు.
Read Also: కాజీపేటలో మెట్రో రైళ్ల తయారీ, రైల్వే మంత్రి కీలక ప్రకటన!