BigTV English

Kazipet RMU: కాజీపేటలో మెట్రో రైళ్ల తయారీ, రైల్వే మంత్రి కీలక ప్రకటన!

Kazipet RMU: కాజీపేటలో మెట్రో రైళ్ల తయారీ, రైల్వే మంత్రి కీలక ప్రకటన!

Railway minister Ashwini Vaishnaw: గత దశాబ్ద కాలం భారతీయ రైల్వే అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. అత్యధునిక రైళ్లను తయారు చేయడంతో పటు విదేశాలు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే పలు దేశాల నుంచి 150 లోకో మోటివ్ లకు ఆర్డర్లు వచ్చినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ పర్యటలో భాగంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆయన కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను సందర్శించారు. ఇక్కడ లోకోమోటివ్‌ లు, బోగీలతో పాటు, మెట్రో రైళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.


రూ. 500 కోట్లతో రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ

తెలంగాణ అభివృద్ధి పైన కేంద్రం కీలక దృష్టి పెట్టిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యంగా వరంగల్ ను అన్ని రకాలుగా అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ ప్రజల చిరకాల కల అయిన కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఒక అద్భుతం అన్నారు. రూ. 500 కోట్లతో నిర్మిస్తున్న మెగా ఫ్యాక్టరీ అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కలను ప్రధాని మోడీ నెరవేర్చుతున్నారని చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు  సివిల్ కన్ స్ట్రక్షన్ పనులు పూర్తవుతాయన్నారు. 2026లో మాన్యుఫాక్చరింగ్ పనులు మొదలవుతుందని తెలిపారు.


దేశంలోనే అదిపెద్ద తయారీ యూనిట్

ఇక కాజీపేట రైల్వే తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్ద తయారీ యూనిట్ గా నిలువబోతుందన్నారు. ఇక్కడ ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ ను తయారు చేయనున్నట్లు తెలిపారు. కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వార 3,000 మందికి ప్రత్యక్షంగా, వేల సంఖ్యలో స్థానికులకు పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.

Read Also: లగేజ్ రాక్ లో పడుకున్న ప్రయాణీకుడు, ఇంకెక్కడా ప్లేస్ లేదా భయ్యా!

హైదరాబాద్ లో రైల్వే సామర్థ్యం రెట్టింపు

అటు హైదరాబాద్ లో రైల్వే సామర్థ్య రోజు రోజుకు మరింత పెరుగుతుందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అంతేకాదు, హైదరాబాద్ ప్రాంతంలో రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం రోజుకు సుమారు 600 రైళ్లు నడుస్తున్నాయని, ప్రస్తుత కార్యాచరణ సామర్థ్యాన్ని మరికొద్ది సంవత్సరాల్లో రోజుకు 1,200 రైళ్లకు పెంచుతామన్నారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకునే బాధ్యతలను ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌  కు కేటాయించినట్లు తెలిపారు. “సికింద్రాబాద్ సమీప స్టేషన్లతో సహా మొత్తం హైదరాబాద్ ప్రాంతం సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో సికింద్రాబాద్ స్టేషన్  పునరాభివృద్ధి కూడా ఉంది. ఇప్పటికే రైల్వే స్టేషన్ పనులు పూర్తవుతున్నాయి” అని వైష్ణవ్ తెలిపారు.

Read Also: 600 రైళ్లు 1200కు పెంపు.. అదిరిపోయే న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి!

Related News

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Big Stories

×