Indian Railway Tatkal Booking: భారతీయ రైల్వే అత్యవసర ప్రయాణం చేసే వారి కోసం తత్కాల్ టికెట్ బుకింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు బయల్దేరడానికి ఒకరోజు ముందు 10 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. అయితే, తత్కాల్ బుకింగ్ అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. హైస్పీడ్ నెట్, అన్ని సౌకర్యాలు ఉన్నా క్షణాల్లో టికెట్లు అయిపోతాయి. సాధారణ ప్రయాణీకులు టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తే రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ట్రావెల్ ఏజెంట్లు ఈజీగా తత్కాల్ టికెట్లను బుక్ చేస్తారు. తాజాగా ఇదే అంశంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది ఓ స్కామ్ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తత్కాల్ టికెట్ బుకింగ్ ఓ స్కామ్?
టికెట్ బుకింగ్ ఏజెంట్లు క్షణాల్లో తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నారు. సాధారణ ప్రయాణీకులు ఎంత ట్రై చేసినా టికెట్ బుకింగ్ సాధ్యం కావడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇదో పెద్ద స్కామ్ అని ఆరోపిస్తున్నారు. ట్రావెల్ ఏజెంట్లు సెకెన్లలో టికెట్లను బుక్ చేసుకునేందుకు చట్ట విరుద్ధమైన సాప్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారని మండిపడుతున్నారు. దీనివల్ల నిజమైన వినియోగదారులు అన్యాయానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధారణ ప్రయాణీకులు మధ్య వర్తుల నుంచి అధిక ధరలు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తుందంటున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే సంస్థ, రైల్వేశాఖ కళ్లుమూసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో తత్కాల్ స్కామ్ పై నెటిజన్ల ఆగ్రహం
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే వారి రోజువారీ కష్టాలను వివరిస్తూ ఒక ట్విట్టర్ వినియోగదారుడు పోస్ట్ పెట్టాడు. బుకింగ్ కు సంబంధించి కీలకమైన సమయంలో IRCTC వెబ్ సైట్ పని చేయకపోవడం, సీట్లు వెంటనే అయిపోవడం జరుగుతుందని ఓ యూజర్ వివరించారు. “తత్కాల్ బుకింగ్ ఒక రోజు ముందు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సీట్లు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. కానీ, ఉదయం 10 గంటలు అయిన వెంటనే, IRCTC సైట్ హ్యాంగ్ అవుతుంది. 10:03 గంటలకు సీట్లు అన్ని అయిపోతాయి. ఆ తర్వాత సైట్ యథావిధిగా పని చేస్తుంది” అని ఇన్ఫో గ్రాఫిక్స్ తో వివరించాడు. “IRCTC తత్కాల్ బుకింగ్ ఒక స్పష్టమైన స్కామ్. ఎందుకంటే బాట్స్, ఏజెంట్స్ నెక్సస్, సూపర్ తత్కాల్ లాంటి చట్ట విరుద్ధ సాఫ్ట్ వేర్లను ఉపయోగించి టికెట్లను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన ప్రయాణీకులను అందకుండా సెకెన్లలో మాయం చేస్తున్నారు” అని రాసుకొచ్చాడు.
from few days I am trying to book tatkal ticket but my login doesn’t happen just few mins before and by chance if its get logging then at payment option it don’t proceed. @IRCTCofficial if full of corrupted employees they sell tickets to agent and block website for normal people pic.twitter.com/9JO3HhG6S6
— PRABHASH JHA (@Prabhash_Jha29) June 1, 2025
తత్కాల్ బుక్ చేయడం కంటే సివిల్స్ ర్యాంక్ సాధించడం ఈజీ
పీక్ టైమ్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంలో IRCTC సైట్ విఫలం అయ్యింది. “UPSC పరీక్షను క్లియర్ చేయడం కంటే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టంగా మారింది. హై-స్పీడ్ వైఫై ఉన్నప్పటికీ.. ఒక్క టికెట్ కూడా బుక్ చేసుకోలేము. విండో ఓపెన్ అయిన తర్వాత ఏదో మాయ జరుగుతుంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Booking a Tatkal ticket is more difficult than clearing the UPSC exam. Despite having high speed WiFi, even a single ticket cannot be booked and the website is such that it does not open even after time. IRCTC has a very bad interface @AshwiniVaishnaw @IRCTCofficial @ajeetbharti pic.twitter.com/SLnHaWrpot
— ࿗ सौरभ सिंह ࿗ (@Dharti_Putr) June 1, 2025
ఏజెంట్లతో IRCTC ఉద్యోగుల కుమ్మక్కు!
మరికొంత మంది వినియోగదారులు ఇంకో అడుగు ముందుకేసి, IRCTC అధికారులు ఏజెంట్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సాధారణ వినియోగదారులకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సాధారణ ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ IRCTC, రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరోవైపు తత్కాల్ బుకింగ్ వ్యవస్థపై ఆడిటింగ్ లేదంటే స్కామ్ పై అధికారిక విచారణ జరిపించాలని కోరుతున్నారు.
Read Also: రైలుకు వేలాడుతూ ఓవరాక్షన్.. తర్వాత జరిగింది చూస్తే జ్వరం పక్కా!