Viral Train Video: రైల్లో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ప్రయాణీకులు పెడచెవిన పెడుతున్నారు. రన్నింగ్ ట్రైన్ లో ఓవరాక్షన్ చేసి, ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి రైలుకు వేలాడుతూ వెళ్తూ తృటితో చావు నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా ఓ రైలు వేగంగా ప్రయాణం చేస్తుంది. అందులోని ప్రయాణీకుడు షర్ట్ విప్పేసి నైట్ ప్యాంట్ మీద ఉన్నాడు. రైలుకు వేలాడుతూ స్టంట్స్ చేశాడు. హర హర మహా దేవ్ అంటూ నినాదాలు చేశాడు. ముందు ఏం ఉంది అని చూసుకోకుండా ఒంటి చేత్తో రైలును పట్టుకుని మరో చేతిని బయటకు పెట్టి వేలాడే ప్రయత్నం చేశాడు. కానీ, కొద్ది దూరం వెళ్లగానే రైలుకు కరెంటు అందించే పోల్ ఒక్కసారిగా ముఖానికి తగిలింది. అయితే, పోల్ కు ఉన్న బాక్స్ తగలడంతో వెంటనే అలర్ట్ అయి తలను లోపలికి లాగాడు. లేదంటే అదే వేగంతో తల సరిగ్గా కరెంటు స్థంభానికి తగిలి ఉంటే స్పాట్ లోనే చనిపోయే వాడు. ఈ వీడియోను భాను నంద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “అతడు రైల్లో వేలాడుతూ ప్రయాణించాడు. ఇంతో ఊహించని ఘటన జరిగింది. మహాకాల్ భక్తుడైన ప్రయాణీకుడిని శివుడు కూడా ఏం చేయలేకపోయాడు” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ट्रेन में लटक कर सफर कर रहा था
ऐसा हुआ जिसको कभी सपने में भी नहीं सोचा होगाकाल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का, यह डायलॉग बाजी में ही अच्छा लगता है
जिंदगी में सच्चाई से इसका कोई वास्ता नहीं pic.twitter.com/zNTFju9GsV
— Bhanu Nand (@BhanuNand) June 2, 2025
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “దెబ్బ తగలడానికి ముందు అతడు చేసిన హర హర మహాదేవ్ నినాదాలే కాపాడాయి” అని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. “అతడు లేచిన సమయం బాగుంది. అందుకే, చావు నుంచి తప్పించుకున్నాడు” అని ఇంకొంత మంది అన్నారు. “తల ఇంకాస్త బయటకు పెడితే స్పాట్ లోనే ప్రాణాలు పోయేవి. మిరాకిల్ జరిగి బతికి బట్టకట్టాడు” అని మరికొంత మంది రాసుకొచ్చారు. “బహుశ ఆ స్తంభాన్ని అబ్దుల్ అనే వ్యక్తి ఏర్పాటు చేసి ఉంటాడు. అందుకే, మహాకాల్ భక్తుడిని తగిలించింది” అని ఇంకో వ్యక్తి ఫన్నీగా కామెంట్ పెట్టాడు. “ఇలాంటి వ్యక్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. భారీగా జరిమానా విధించడంతో పాటు శిక్షలు కూడా 15 రోజుల్లో అమలు చేశాయి. లేదంటే ఇలాంటి వాళ్లు మిగతా ప్రయాణీకులను కూడా చెడగొట్టే అవకాశం ఉంటుంది” అని మరికొంత మంది అభిప్రాయపడ్డారు. అటు ఈ ఘటనపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ ప్రయాణీకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం కొనసాగించాడు? అతడి అడ్రస్ ఎక్కడ అనే విషయాలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడిపై కేసు నమోదు చేయనున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!