BigTV English

Vande Bharat Express trains: ఆ రూట్లలో దోమలు తోలుకుంటున్న వందే భారత్ రైళ్లు.. రైల్వే మంత్రి ఆన్సర్ ఇదే!

Vande Bharat Express trains: ఆ రూట్లలో దోమలు తోలుకుంటున్న వందే భారత్ రైళ్లు.. రైల్వే మంత్రి ఆన్సర్ ఇదే!

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నది. ప్రయాణీకులకు మెరుగైన జర్నీ అనుభవాన్ని అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను శరవేగంగా మెరుగుపరుస్తోంది. అందులో భాగంగానే 2019లో భారత్ లొ తొలి స్వదేశీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ అల్ట్రా మోడ్రన్ రైలు ప్రయాణీకులకు ఫేవరెట్ గా మారింది.


దేశ వ్యాప్తంగా 136 వందేభారత్ రైళ్లు

ప్రస్తుతం దేశంలో మొత్తం 136 వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ఈ రైళ్లు ప్రయాణీకుల ఆహ్లాదకరమైన జర్నీని అందించడంతో పాటు ప్రయాణ సమయాన్ని చాలా తగ్గిస్తున్నాయి. 2024లో దేశ వ్యాప్తంగా రైల్వేశాఖ 46 కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైళ్లలో మూడు కోచ్ పోజిషన్ లో ఉన్నాయి. అందులో ఒకటి 8 కోచ్ లు, రెండో 16 కోచ్ లో,  మూడోది 20 కోచ్ లతో సేవలు అందిస్తున్నాయి.


ఇతర రైళ్లతో పోల్చితే ఛార్జీలు ఎక్కవ!

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ టిక్కెట్ ధర ఇతర రైళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. అధునాతన భద్రతా లక్షణాలు, సౌకర్యాలను కల్పించడంతో పాటు, ఈ రైళ్లు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. సూపర్ రైడ్ కంఫర్ట్, సౌకర్యవంతమైన సీటింగ్, ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్లతో పాటు హాట్ కేస్‌లతో కూడిన మినీ ప్యాంట్రీని ప్రయాణీకులకు అందిస్తాయి. అందుకే, ఇతర రైళ్లుతో పోల్చితే ఇందులో టికెట్ ధర ఎక్కువ.

Read Also: వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో పట్టాలెక్కవా? అసలు విషయం చెప్పేసిన రైల్వేమంత్రి!

ప్రయాణీకులు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదా?

ఎక్కువ ధర కారణంగా వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులు వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపట్లేదనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇండియన్ రైల్వేలో రిజర్వేషన్ కు ఏడాదంటతా ఒకే డిమాండ్ ఉందన్నారు. లీన్, పీక్ ట్రావెల్ పీరియడ్ల మధ్య ప్రయాణీకుల ఆక్యుపెన్సీ హెచ్చుతగ్గులకు లోనవుతుందన్నారు. “భారతీయ రైల్వేలో రిజర్వేషన్ టికెట్లకు ఏడాదంతా ఒకేలా డిమాండ్ ఉంది. లీన్, పీక్ పీరియడ్లలో మారుతూ ఉంటుంది. అంతేకాదు, తక్కువ స్టాఫులు, తక్కువ రన్నింగ్ టైమ్‌తో కూడిన రైళ్ల పట్ల ప్రయాణీకుల ఆదరణ చాలా బాగుంటుంది. 2024-25లో (అక్టోబర్, 24 వరకు) వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల మొత్తం ఆక్యుపెన్సీ 100% కంటే ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ రైల్వేలో రాష్ట్రాల వారీగా, రైలు వారీగా  ఆదాయ లెక్కింపు అనేది ఉండదు” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎక్కడైనా వందేభారత్ రైళ్లకు తక్కువ ఆక్యుపెన్సీ ఉంటే బోగీల సంఖ్యను తగ్గించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు అన్ని వందేభార్ రైళ్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. మంచి వసతులు.. వేగవంతమైన ప్రయాణం కారణంగా వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నానే రైల్వే మంత్రి.

Read Also: గంటకు 1000 కిలో మీటర్ల వేగంతో నడిచే రైలు.. జస్ట్ 45 నిమిషాల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోవచ్చు!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×