ఇజ్రాయెల్, ఇరాన్ వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాయి. తాజాగా ఖతార్, దుబాయ్ కి విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసాయి. మిడిల్ ఈస్ట్ లో ఏకైక డెస్టినేషన్ అయిన దోహా, ఖతార్ కు విమానాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ ఎయిర్ లైన్స్ నిలిపివేసింది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా పరమైన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. దోహాలోని యుఎస్ రాయబార కార్యాలయం ఖతార్ లోని యుఎస్ పౌరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఓపెన్ గానే దోహా ఎయిర్ పోర్టు
గత వారంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య క్షిపణి దాడుల మధ్య మధ్య ప్రాచ్యానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లే వందలాది విమానాలు రద్దు అయ్యాయి. ఖతార్, యూఏఈ లాంటి దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, వాటి విమానాశ్రయాలకు చెందిన విమానాలు ప్రభావితమయ్యాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య వివాదం ఉన్నప్పటికీ దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికీ తెరిచి ఉంది. విమానాలు ఆలస్యం, క్యాన్సిల్ కు వివరాలను ఆయా ఎయిర్ లైన్స్ కు సంబంధించిన వెబ్ సైట్లలో చెక్ చేసుకోవాలని ఎయిర్ పోర్టు అధికారులు సూచించారు.
పలు విమానాలు రద్దు
అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ AA120 ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంను కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని ఎయిర్ లైన్ అంచనా వేస్తున్నందున.. జూన్ 22 వరకు ఈ విమాన సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జూన్ 18, 19, 20 తేదీల్లో విమానాలు రద్దు చేయబడినట్లు Flightradar24 వెల్లడించింది. “అమెరికన్ ఎయిర్ లైన్స్ తన దోహా, ఖతార్ (DOH) ఆపరేషన్ లో సర్దుబాట్లు చేసింది. జూన్ 22 వరకు DOH- ఫిలడెల్ఫియా (PHL) మధ్య విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మేము పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటాము. అవసరమైన విధంగా మా ఆపరేషన్‌ను మరింత సర్దుబాటు చేస్తాము” అని అమెరికన్ ఎయిర్ లైన్స్ అధికారికంగా ప్రకటించింది.
Read Also: ట్రైన్ మిస్ చేశారా? వెంటనే TDR ఫైల్ చెయ్యండి.. కొత్త రూల్స్ ఇవే!
తెలుగు స్టార్స్ కు ఇబ్బందే!
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జూన్ 19న న్యూవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్ మధ్య తన రోజువారీ విమానాలను కూడా నిలిపివేసింది. ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన తర్వాత ఈ సేవలను తిరిగి ప్రారంభిస్తామని క్యారియర్ తెలిపింది. రెండు గమ్యస్థానాల మధ్య విమానాలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో ఎయిర్ లైన్స్ చెప్పలేదు. యునైటెడ్ న్యూవార్క్ విమానాశ్రయం ద్వారా మాత్రమే దుబాయ్ కి విమానా సర్వీసులను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో తరచుగా దుబాయ్ కి, యూఏఈకి వెళ్లే తెలుగు స్టార్స్ కు ఇబ్బంది కలగనుంది. అయితే, చాలా మంది ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులలో ఆయా దేశాలకు వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
Read Also: హైదరాబాద్ మెట్రో క్రెడిట్ ఆ ముఖ్యమంత్రిదేనా? పునాది వేసింది ఎవరు?