Man’s Miraculous Escape: ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుడప్పుడు అద్భుతా జరుగుతాయి. కేరళలోని ఓ వ్యక్తి విషయంలోనూ మిరాకిల్ జరిగింది. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ ఘటన కన్నూర్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది.
ఫోన్ మాట్లాడుతూ పట్టాల మీదికి..
పవిత్రన్ అనే 56 ఏండ్ల వ్యక్తి పల్లికున్ కున్నావ్ సమీపంలో కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎడక్కాడ్ కడంపూర్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో బస్ క్లీనర్ గా పని చేస్తున్నాయి. షార్ట్ కట్ కావడంతో కన్నూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పన్నెన్ పర రైల్వే బ్రిడ్జిని దాటుతూ వెళ్తుంటాడు. ఎప్పటి లాగే సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్కూల్ అయిపోగానే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో తన కూతురు ఫోన్ చేయడంతో మాట్లాడూ ముందుకు నడిచాడు. అలాగే ట్రాక్ దాటే ప్రయత్నం చేశాడు. ఇంతలో వెనుక నుంచి రైలు దూసుకొచ్చింది. ఏం చేయాలో తెలియని పవిత్రన్ పట్టాల మీదే పడుకున్నాడు. బక్క పలుచని వ్యక్తి కావడంతో ఆయన మీదుగా రైలు వెళ్లిపోయింది. బతుకు జీవిడా అంటూ అక్కడి నుంచి బయటపట్డాడు.
వీడియో రికార్డు చేసిన శ్రీజిత్
ట్రాక్ పక్కనే ఉన్న కె శ్రీజిత్ అనే యువకుడు.. రైలు వస్తుందని పవిత్రన్ ను హెచ్చరించినా ఫోన్ లో బిజీ కావడంతో పట్టించుకోలేదు. ఈ తంతగాన్ని అంతా అతడు ఫోన్ లో రికార్డు చేశారు. ఈ విజువల్స్ రికార్డు చేస్తున్నప్పుడు తన కాళ్లు, చేతులు వణికాయని శ్రీజిత్ చెప్పాడు. “రైల్వే ట్రాక్ దగ్గరికి వెళుతున్న పవిత్రన్‌ని నేను ఫస్ట్ చూశాను. అంతలోనే రైలు విజిల్ వినిపించింది. వెంటనే పవిత్రన్ తన మొబైల్ ఫోన్‌ను కింద పడేసి పట్టాల మధ్య పడుకున్నాడు.నేను అతడిని హెచ్చరించాను. కానీ, తనకు వినిపించలేదు. ఫోన్ తీసుకుని ఆ దృశ్యాన్ని రికార్డు చేసేందుకు ప్రయత్నించాను. మూడు బోగీలు తన మీది నుంచి వెళ్లిన తర్వాతే నేను వీడియో రికార్డు చేశాను. ఆ తర్వాత వీడియోను స్నేహితులకు పంపించాను. కాసేపట్లోనే వైరల్ అయ్యింది” అని శ్రీజిత్ చెప్పాడు.
Terrifying.
A Keralite lies down under a moving train in Kollam and then walks away casually as if nothing happened!#Kerala
.@IndianRailMedia pic.twitter.com/r7rI3x1tnH— Rejimon Kuttappan (@rejitweets) December 24, 2024
పవిత్రన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన రైల్వే పోలీసులు
పవిత్రన్ ట్రాక్ మీద పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పవిత్రన్ ఫోన్‌లో మాట్లాడుతూ రైలు వస్తున్నట్లు గమనించలేదని పోలీసులు తెలిపారు. అతను రైలును చూసి వెంటనే ట్రాక్ పై పడుకుని ప్రాణాలు కాపాడుకున్నాడని చెప్పారు. అతడు బక్కపలుచగా ఉన్నందు వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు.
మద్యం తాగి ట్రాక్ మీద పడుకున్నట్లు ప్రచారం
తొలుత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ట్రాక్‌పై పడుకున్నట్లు పుకార్లు షికారు చేశాయి. కానీ, అవి వాస్తవం కాదని పవిత్రన్ తెలిపారు. “నేను తాగలేదు. ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రాక్ మీద పడుకున్నాను” అని పవిత్రన్ తెలిపారు. ఈ ఘటనతో తనకు పునర్జన్మ లభించినట్లు తెలిపారు.
Read Also:ఫేక్ రైలు టికెట్ల స్కామ్.. మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్!