Chahal Dhanashree Verma Divorce: మామూలుగా విడాకులు తీసుకునే వాళ్ళలో సినీ ప్రముఖులే ఎక్కువ అని అంత అనుకుంటారు. కానీ విడాకులు తీసుకున్న వారిలో భారత క్రికెటర్స్ కూడా చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లో మరో క్రికెటర్ చేరబోతున్నాడని ఇప్పుడు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ జంట మరెవరో కాదు టీమిండియా స్టార్ బౌలర్ యూజువేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ. 2020 సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించారు. ఇదే సమయంలో చాహల్ కి డాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీతో పరిచయం అయ్యింది.
ఈ పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ 2020 డిసెంబర్ 22న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అప్పటినుండి ఈ జంట క్రికెట్ వరల్డ్ లోని పాపులర్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత ధనశ్రీ వర్మ ఇంస్టాగ్రామ్ ఐడి ధనుశ్రీ చాహల్ అని ఉండేది. కానీ వీరి పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత ఇంస్టాగ్రామ్ ఐడి పేరులో నుంచి “చాహల్” అనే పదాన్ని తీసేసినట్లు నెటిజెన్లు గమనించారు. దీంతో ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక చాహల్ కూడా కొత్త జీవితం లోడ్ అవుతుందంటూ ఇంస్టాగ్రామ్ లో స్టోరి షేర్ చేయడంతో వీరిద్దరూ విడాకుల బాట పట్టనున్నారేమోనని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది.
కానీ ఈ రూమర్స్ ని నమ్మొద్దు అంటూ వారిద్దరూ ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజెన్లకు క్లారిటీ ఇచ్చారు. ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయి.. ఈ జంట సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ వారి విడాకుల గురించి చర్చ మొదలైంది. కొంతకాలంగా భారత జట్టులో స్థానం సంపాదించలేక సతమతమవుతున్న చాహల్.. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, తన భార్య ధనుశ్రీ తో మనస్పర్దలు తలెత్తినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు కూడా వీరి విడాకుల వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన వీరి నాలుగోవ వివాహ వార్షికోత్సవం. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎటువంటి విషెస్ పోస్ట్ చేయలేదు. దీంతో మీరు విడిపోబోతున్నారని రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఎందుకంటే వీరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విష్ చేయకుంటే అనుమానం వస్తుంది. మరోవైపు బాలీవుడ్ నిర్మాత, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ ఏకంగా ఈ జంట విడిపోయిందని చెబుతున్నాడు.
Also Read: Vinod Kambli: ఆస్పత్రి బెడ్ పై ఎమర్జెన్సీ వైద్యం.. పాట పాడిన టీమిండియా ప్లేయర్?
కానీ ఇతడు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం కష్టం. మరి ఈ జంట నిజంగానే విడిపోతున్నారా..? లేక ఇవన్నీ వట్టి రూమర్సేనా..? అనేది తెలియాలంటే చాహల్ లేదా ధనశ్రీ లు స్పందించాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు విడిపోయిన క్రికెటర్స్ జాబితా చూస్తే.. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా – నటాషా, దినేష్ కార్తీక్ – నికిత విజయ్, శిఖర్ ధావన్ – ఆయేషా ముఖర్జీ, మహమ్మద్ అజారుద్దీన్ – నౌరిన్, భారత మాజీ పేస్ బౌలర్ శ్రీనాథ్ – జోత్స్న, అనిల్ కుంబ్లే – చేతన రమకీర్తన, వినోద్ కాంబ్లీ – నొయెల్ల లూయిస్, మహమ్మద్ షమీ – హాసిన్.. ఇలా చాలా జంటలు తమ వైవాహిక జీవితానికి స్వస్తిపలికారు.