Indian Railways: భారతీయ రైల్వే గత దశాబ్ద కాలంగా అత్యాధునిక హంగులను అద్దుకుంటున్నది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలకు స్వీకరించిన తర్వాత రైల్వేపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అద్భుతంగా పునర్నిర్మించడంతో పాటు అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతిష్టాత్మక రైల్వే లైన్లను పూర్తి చేయడంతో పాటు సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించారు. మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన వందేభారత్ రైళ్లను ప్రయాణీకులకు పరిచయం చేశారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అత్యంత వేగంగా ప్రయాణీకులను గమస్య స్థానాలకు చేర్చుతూ.. ఈ రైళ్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రైళ్లు రోజు రోజుకు అప్ డేట్ అవుతున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మరోవైపు బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. భారతీయ రైల్వే రోజు రోజుకు సరికొత్త మైలు రాళ్లును దాటుతూ ముందుకుసాగుతోంది.
ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలు
దేశంలో కొన్ని రైళ్లు తమకంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ముంబై – హపా దురంతో ఎక్స్ ప్రెస్. దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలుగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు మార్గ మధ్యంలో కేవలం మూడు స్టేషన్లలోనే ఆగుతుంది. అంతేకాదు, రైలు బయల్దేరిన స్టేషన్ నుంచి ఆగకుండా ఏక బిగిన 493 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అందుకే ఈ రైలు ఆగకుండా ఎక్కువ దూరం జర్నీ చేసే నాన్ స్టాఫ్ రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రైలు ప్రతి రోజు రాత్ర 11 గంటలకు ముంబైలో బయల్దేరుతుంది. నాన్ స్టాఫ్ గా 493 కిలో మీటర్ల దూరం ప్రయాణించి, తెల్లవారుజామున 4.50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత మరో రెండు స్టేషన్లలో ఆగి హపాకు వెళ్తుంది.
Read Also: ఇ-టికెట్ ఉన్నా.. ఇది లేకపోతే జరిమానా కట్టాల్సిందే! రైల్వే కొత్త రూల్ గురించి తెలుసా?
నాన్ స్టాప్ గా ఎక్కువ దూరం ప్రయాణించే మరికొన్ని రైళ్లు
ఇక ముంబై – హపా రైలు తర్వాత పుణె హౌరా దురంతో ఎక్స్ ప్రెస్ కూడా నాన్ స్టాఫ్ గా ఎక్కువ దూరం ప్రయాణించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు పుణెలో బయల్దేరి నాన్ స్టాఫ్ గా 468 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అటు ముంబై- న్యూఢిల్లీ రైలు సైతం నాన్ స్టాఫ్ గా 465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ముంబైలో బయల్దేరిన ఈ రైలు ఏకబిగిన 465 కి.మీ ప్రయాణించి రాజస్థాన్ లోని కోటాలో ఆగుతుంది. మరికొన్ని రైళ్లు కూడా నాన్ స్టాప్ గా ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉన్న భారతీయ రైల్వేలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పలు రైళ్లు ఉన్నాయి.
Read Also: రైలు బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?