BigTV English

Naga Vamsi – Boni Kapoor: బాలీవుడ్ ప్రొడ్యూసర్ ముందు బాలీవుడ్ ను అంత మాట అనేసావేంటి బ్రో

Naga Vamsi – Boni Kapoor: బాలీవుడ్ ప్రొడ్యూసర్ ముందు బాలీవుడ్ ను అంత మాట అనేసావేంటి బ్రో

Naga Vamsi – Boni Kapoor: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఎస్ ఎస్ రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమా తీయడం మొదలు పెట్టాడు అక్కడి నుంచి తెలుగు సినిమా స్థాయి శిఖరానికి చేరింది. చాలామంది మిగతా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులకు కూడా తెలుగు సినిమా స్టామినా ఏంటో ఒక్కసారిగా తెలిసి వచ్చింది. ఒకప్పుడు తెలుగు సినిమాని చూసే విధానం వేరు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు వంటి హీరోలకు గోవా ఫిలిం ఫెస్టివల్ లో వాళ్ల ఫోటోలు లేవు అంటూ బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్,ఎన్టీఆర్, రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.


ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూడా పాల్గొన్నారు. బోనీ కపూర్ కి అలానే తెలుగు నిర్మాత నాగ వంశీకి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. సర్ మీ హిందీ సినిమాను మా తెలుగు సినిమా మళ్లీ రీడిఫైన్ చేసింది. చాలా గొప్ప సినిమాలు రీసెంట్ టైమ్స్ లో మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, అనిమల్ ఇవన్నీ సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు వినగానే బోనీకపూర్ కొద్దిపాటి అసహనం వ్యక్తం చేశారు. పుష్ప సినిమా హీరో కూడా అమితాబచ్చన్ ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. దానిదేముంది సార్ నేను షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అంటే చెప్పుకొచ్చాడు నాగ వంశీ. అలానే అల్లు అర్జున్ కేవలం అమితాబచ్చన్ గారికి మాత్రమే కాకుండా చిరంజీవి గారికి కూడా పెద్ద ఫ్యాన్ ఉంటే చెప్పుకొచ్చాడు. దీనికి బోనికపూర్ రియాక్ట్ అవుతూ అయి ఉండొచ్చు కానీ మీడియాలో చెప్పినప్పుడు మాత్రం అమితాబచ్చన్ ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు.

తెలుగు సినిమాకి యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అలానే కొన్ని సినిమాలకి కొన్ని ఏరియాల్లో మంచి మార్కెట్ ఉంటుంది అంటూ ఏదో ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోయాడు బోని కపూర్. ఇక తెలుగు సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమా తీసి దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేశాడు. అది తెలుగు డైరెక్టర్ కి ఉన్న సత్తా అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రివ్యూ రైటర్లకు కూడా తన టేకింగ్ తో దడ పుట్టించాడు సందీప్ రెడ్డి వంగ. చెప్పి మరీ వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చూపించాడు.


Also Read : Pawan Kalyan about OG : అవి అరుపులు కాదు బెదిరింపులు

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×