Indian Railways: భారతీయ రైల్వే సంస్థ రోజు రోజుకు సరికొత్తగా అప్ డేట్ అవుతోంది. ఇప్పటికే అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్త మార్పులతో అమృత్ భారత్ వెర్షన్ 2.0ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పేదలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా వచ్చే 2 ఏళ్లలో 50 అమృత్ భారత్ లేటెస్ట్ రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లను పరిశీలించిన అశ్విని వైష్ణవ్
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లను మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి అమృత్ భారత్ రైళ్ల పురోగతిని సమీక్షించారు. అమృత్ భారత్ వెర్షన్ 2.0తో పాటు వందేభారత్ స్లీపర్ రైళ్ల రైళ్ల తయారీని పరిశీలించారు. గత ఏడాది అందుబాటులోకి వచ్చిన అమృత్ భారత్ రైళ్లతో పోల్చితే ఈ రైళ్లలో 12 రకాల మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు.
అమృత్ భారత్ లేటెస్ట్ వెర్షన్ లో కీలక మార్పులు
గత ఏడాది జనవరిలో అమృత్ భారత్ రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. గత ఏడాది కాలంలో మంచి స్పందన లభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సరికొత్తగా ఈ రైళ్లను అప్ డేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా 12 రకాల ఫీచర్లను యాడ్ చేసినట్లు తెలిపారు. సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్, ఎమర్జెన్సీ ఆట్ బ్యాక్ ఫీచర్, ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్, వందేభారత్ మాదిరిగానే ఆఫ్ కాని లైట్లు, ఛార్జింగ్ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్ ను మార్చినట్లు తెలిపారు. ఎర్గోనామిక్ సీట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాటర్ బాటిల్ హోల్డర్లును కూడా రూపొందించినట్లు తెలిపారు.
🚆 Amrit Bharat Version 2.0: affordable and superior rail travel 🛤️
🧵A quick dive into the upgraded features👇 pic.twitter.com/EQ9CO2X1sL
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 10, 2025
పేదలకు మెరుగైన ప్రయాణ అనుభవం
పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించే లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకొస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఈ రైళ్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. “రాబోయే రెండు సంవత్సరాలలో ICFలో 50 అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ రైళ్లు సరసమైన, అమెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ మొదటి వెర్షన్ ను మిక్స్ చేసి అమృత్ భారత్ వెర్షన్ 2.0ను రూపొందిస్తున్నాం” అని తెలిపారు.
త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభం
దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. సుదూర ప్రయాణాలకు అనుగుణంగా ఈ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తాయన్నారు. ఈ రైళ్లకు సంబంధించిన ప్రారంభం తేదీని త్వరలో ఖరారు చేస్తామన్నారు.
Read Also: వచ్చేస్తోంది హైడ్రోజన్ రైలు, దీని పవర్ ముందు మిగతావన్నీ దిగదుడుపే!