Upasana Konidela: టాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) కూడా ఒకరు. భర్త ఏం చేసినా తనకు సపోర్ట్‌గా ఉంటూ ముందుకు నడిపిస్తుందని ఉపాసనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. ఈ సినిమా కోసం మేకర్స్ అంతా భారీగానే ప్రమోషన్స్ చేశారు. ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ విషయంలో రామ్ చరణ్ మాత్రమే కాదు.. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంటోంది. ఇటీవల చిరంజీవి ఈ మూవీపై తన రివ్యూ అందించగా.. ఉపాసన కూడా స్పెషల్ ట్వీట్‌తో ‘గేమ్ ఛేంజర్’కు విషెస్ చెప్పింది.
మొత్తానికి వచ్చేసింది
రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ మూడేళ్ల నుండి ప్రొడక్షన్‌లో ఉంది. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా చాలామందిలో మొదలయ్యాయి. పైగా దర్శకుడు శంకర్ కూడా మధ్యలో కొంతకాలం పాటు ‘గేమ్ ఛేంజర్’ను పక్కన పెట్టి ‘ఇండియన్ 2’పై ఫోకస్ పెట్టాడు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ పని అంతే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కూడా. అంతలోనే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యింది. మెల్లగా పాటలకు సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఫైనల్‌గా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఉపాసన కూడా ఇప్పుడు ఈ ప్రమోషన్స్‌లో భాగమయ్యి భర్తకు సపోర్ట్‌గా నిలబడింది.
Also Read: సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న రజినీ.. ‘కూలీ’ రిలీజ్ డేట్‌పై కీలక అప్డేట్
నిజమైన గేమ్ ఛేంజర్
‘గేమ్ ఛేంజర్’ మూవీ మొదటి రోజు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ‘కంగ్రాచులేషన్స్ మై డియర్ హస్బెండ్. నువ్వు ప్రతీ అంశంలో నిజంగానే గేమ్ ఛేంజర్. లవ్ యూ’ అంటూ తన భర్తను ప్రశంసల్లో ముంచేసింది ఉపాసన. దాంతో పాటు ‘గేమ్ ఛేంజర్’కు వచ్చిన పాజిటివ్ రివ్యూలు అన్నీ కలిపి కూడా ఈ పోస్ట్‌లో షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వచ్చి మొదటి హిట్ కొట్టాడని అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. కానీ మామూలు మూవీ లవర్స్ మాత్రం మూవీ యావరేజ్ అనే స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత
రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన తర్వాత రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. దాంతో ఈ మెగా హీరో పాపులారిటీ దేశవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత హీరోగా మరో మూవీలో నటించలేదు రామ్ చరణ్. చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’లో గెస్ట్ రోల్‌లో నటించినా ఆ మూవీ డిశాస్టర్ అయ్యింది. అందుకే మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ‘గేమ్ ఛేంజర్’పైనే ఉన్నాయి. మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కొందరి అంచనాలను అందుకుంది, కొందరి దృష్టిలో యావరేజ్‌గా మిగిలిపోయింది.
Congratulations my dearest husband @AlwaysRamCharan
You truly are a game changer in every way.
Love u 🥰 ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/qU6v54rRbh— Upasana Konidela (@upasanakonidela) January 10, 2025