Intinti Ramayanam Today Episode January 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం అవని రాజేంద్రప్రసాద్ దగ్గరకొచ్చి మీరు ఏమి ఆలోచించకండి మావయ్య టెన్షన్ పడకండి అని చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి శ్రీకర్ వస్తాడు. నేను ముంబైలో ఉన్నాను అమ్మ ఫోన్ చేసినప్పుడు రాలేకపోయాను నాన్నను ఒకసారి చూస్తానని శ్రీకర్ లోపలికి వెళ్తాడు. అక్షయ్ అడ్డుకొని నాన్నకు టెన్షన్ పడగొద్దని చెప్పారు నిన్ను చూస్తే మళ్ళీ టెన్షన్ పడతాడు నువ్వు వెళ్ళరా అని బయటకు పంపిస్తాడు. శ్రీకర్ ని బయటికి పంపించడం పార్వతి చూస్తుంది. పల్లవి పార్వతికి అక్షయ గురించి లేనిపోనివి ఎక్కించి చెప్తుంది. పార్వతి మనసులో అక్షయ్ మీద కోపం కలిగేలా చేస్తుంది.. ఇక రాజేంద్రప్రసాద్ దగ్గరికి అందరూ వస్తారు. పార్వతి ఏదో చెప్పాలనుకుని వస్తుంది కానీ రాజేంద్రప్రసాద్ను చూసి ఆగిపోతుంది. ఇక శ్రీకర్ ని ఇంట్లో నుంచి గెంటైయడం చూసి బాధపడుతుంది. రాజేంద్ర ప్రసాద్ ని చూడటానికి పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అక్కడికి వస్తాడు. మీరు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత లేనిపోని టెన్షన్స్ ఎందుకు బావగారు మీరు కాస్త రిలాక్స్ అవ్వండి మీ పిల్లలు చూసుకుంటారు కదా మీరు టెన్షన్ తీసుకుంటే ఇలాంటి హాట్ స్ట్రోక్లే వస్తాయని సలహా ఇస్తాడు. పల్లవి వాళ్ళ నాన్నతో పార్వతీ వినేలా నాటకం మొదలు పెడుతుంది. మామయ్య గారి ఆరోగ్యం బాగోలేదు అత్తయ్య గారికి కొడుకు గురించి ఆలోచన ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది డాడీ అని అంటుంది. అక్షయ్ పై పార్వతికి అనుమానం పెరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. అవని చెప్పడంతో ఆస్తి పంపకాల గురించి లాయర్ తో మాట్లాడతాలని అక్షయ్ వెళ్తాడు.. పల్లవి చిన్న పని ఉంది అత్తయ్య హాస్పిటల్ కి వెళ్దామని తీసుకెళ్తుంది. కమల్ అమ్మ ఎందుకు నేను వస్తా పద అంటాడు. లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కే తెలుస్తాయి బావ నేను అత్తయ్య ని తీసుకెళ్లి పోతాను అని అంటుంది. పల్లవి అనుకున్న ప్లాన్ ప్రకారం దయాకర్ ను అక్షయ్ కి ఎదురుగా రమ్మని చెప్తుంది. దయాకర్ అక్షయ్ మాట్లాడుకోవడం పార్వతి చూసి వీరిద్దరూ ఇంత చనువుగా మాట్లాడుకుంటున్నారు ఏంటి? వీరిద్దరికీ నిజం తెలుసా అని అనుకుంటుంది. అక్షయ్ కు దయాకర్ మేనమామ అనే విషయం తెలిసిపోతుందని పార్వతి టెన్షన్ పడుతుంది. అక్షయ్ కి తెలిసే నా దగ్గర దాచి పెట్టాడా అని అనుమాన పడుతుంది. పల్లవి ప్లాన్ వర్క్ అవుట్ అయిందని పల్లవి సంతోషపడుతుంది. ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంటే డాక్టర్ కి ఫోన్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది రేపు రండి అని చెప్తుంది. పార్వతి పల్లవి ఇంటికి వెళ్లి పోతారు..
అక్షయ్ లాయర్ ను కలిసి అసలు విషయాన్నీ తెలుసుకుంటాడు. అక్షయ్ మీ నాన్న ఆల్రెడీ వీలునామా రాయించారు నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు అని అంటాడు లాయర్. నీ పేరు మీద 51% ఆస్తి వచ్చేలా రాయించాడు మీ నాన్న. అదేంటది అలా ఎందుకు రాయించారు లాయర్ గారు అంటే అది మీ నాన్నని అడగాలి అక్షయ్ అని అంటాడు.. అయితే వెళ్లి మీ నాన్నగారిని ఒకసారి అడిగి దాని మీద సంతకం పెట్టించుకుని అగ్రిమెంట్ ని క్యాన్సల్ చేయండి. నువ్వు కొత్తగా వీలునామా రాసి తీసుకొస్తాను అని లాయర్ అంటాడు అలాగే లాయర్ గారు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇంట్లో కోమలి వినోద్ సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫీస్ టూరు ఎలా జరిగింది బావ అని కమల్ అక్కడికి వస్తాడు. కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతాడు. ఏం తీసుకురాలేదు నీకేం తీసుకొస్తాడు కావాలంటే ఆయన కోసం తెచ్చుకుని నీకు ఇస్తాడు లేదంటే వద్దు వద్దు అన్నయ్య బర్త్డే రోజు ఇచ్చింది నాకు ఇంతవరకు గుర్తు ఉంది అని కమల్ భయపడతాడు.
రాజేంద్రప్రసాద్ కిందికి రాగానే అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్షయ అక్కడికి వస్తాడు. నాన్న నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అడుగుతాడు. మీరు నా పేరు మీదే 51% ఆస్తిని ఎందుకు వీలునామా రాయించారు నాకు తెలియాలి నాన్న అంటాడు. దానికి కమల్ కూడా షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఆ విషయం వినగానే ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. ఎందుకు నాన్న ఇలా చేసావని కోమలి అడుగుతుంది. నేనేం చేసినా తనుకు ఒక కారణం ఉంటుంది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..