BigTV English

Railway – Union Budget: 92 ఏండ్ల సాంప్రదాయానికి ఫుల్ స్టాఫ్.. రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో ఎందుకు విలీనం చేశారంటే?

Railway – Union Budget: 92 ఏండ్ల సాంప్రదాయానికి ఫుల్ స్టాఫ్.. రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో ఎందుకు విలీనం చేశారంటే?

Union Budget 2025: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2005-26కు సంబంధించిన యూనియన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులతో పాటు మధ్య తరగతి వేతన జీవులు బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో రైల్వేకు పెద్దపీట వేస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ లో విలీనం గురించి చర్చ మొదలయ్యింది. 20016 రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ వేర్వేరుగా ఉండేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం  2016లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని నిర్ణయించింది. 2017లో తొలిసారి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రైల్వే, సాధారణ బడ్జెట్ లను కలిపి పార్లమెంట్ ముందుంచారు. అప్పటి నుంచి  రెండు బడ్జెట్ లను కలిపి ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది సైతం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు.


90 ఏండ్ల సాంప్రదాయానికి స్వస్తి పలికిన మోడీ సర్కారు

వాస్తవానికి రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అనేది 1924లో ప్రారంభం అయ్యింది. 1921లో ఈస్ట్ ఇండియా రైల్వే కమిటీ చైర్మెన్ గా ఉన్న సర్ విలియం అక్వర్త్ రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సిఫార్సు చేశారు. 1924లో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ను వేరు చేయాలని సూచించారు. అప్పటి నుంచి రెండు బడ్జెట్ లు వేర్వేరు కొనసాగుతున్నాయి. 2017లో ఈ సాంప్రదాయానికి బ్రేక్ పడింది. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ కు ముగింపు పలకాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభు ఈ సిఫార్సును బేస్ చేసుకుని ఆర్థిక వ్యవస్థకు, రైల్వేలకు మేలు చేసేలా రైల్వే, కేంద్ర బడ్జెట్‌ లను కలపాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఆయన ప్రతిపాదనను అరుణ్ జైట్లీ 2016లో పార్లమెంట్ లో లేవనెత్తారు.  ఆ తర్వాత రెండు బడ్జెట్ లను విలీనచేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
రైల్వే బడ్జెట్ ను ఎందుకు విలీనం చేశారు? 


1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రైల్వేల ద్వారా వచ్చే ఆదాయం, సాధారణ ఆదాయంతో పోల్చితే 6 శాతం ఎక్కువగా ఉండేది. అందుకే, ప్రత్యేక రైల్వే బడ్జెట్ ను కొనసాగించాలని అప్పట్లో సర్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు 21 డిసెంబర్ 1949న ఈ ప్రతిపాదనకు రాజ్యాంగసభ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ప్రత్యేక రైల్వే బడ్జెట్ 2016 వరకు కొనసాగింది. ఈ విషయాన్ని 2016లో రాజ్యసభలో ప్రస్తావించిన అరుణ్ జైట్లీ “కొన్నేళ్లుగా రైల్వే బడ్జెట్ గణనీయంగా తగ్గిపోయింది, అందువల్ల, ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు” అరి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత  కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసింది.

2025 బడ్జెట్‌ లో రైల్వే కేటాయింపులు ఎలా ఉండవచ్చు?

ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఆధునికీకరణ, విద్యుదీకరణకు కేటాయింపులు ఎక్కువగా ఉండనున్నాయి. హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ అప్‌ గ్రేడ్‌ లు, పూర్తి విద్యుదీకరణ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి PPPను పెంచే అవకాశం ఉంది. గూడ్స్ రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి లాజిస్టిక్స్ నెట్‌ వర్క్‌ ను బలోపేతానికి అవసరమైన బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉంది. మొత్తంగా రైల్వేకు సుమారు రూ. 3 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తుంది.

Read Also: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాలు, టాప్ 10లో భారత్ ఏ ప్లేస్ లో ఉందంటే?

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×