విమాన ప్రయాణంలో సమయంలో పైలెట్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఏ చిన్న పొరపాటు చేసినా, విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలు రిస్క్ లో పడతాయి. అందుకే విమాన ప్రయాణ సమయంలో కొన్ని భద్రతా చర్యలు పాటిస్తారు. అందులో ఒకటి విమానం టేకాఫ్, ల్యాండింగ్ టైమ్ లో క్యాబిన్ లైట్లు డిమ్ చేస్తారు. ఇంతకీ క్యాబిన్ లైట్లు ఎందుకు డిమ్ చేస్తారు? దాని వెనుకున్న అసలు కథ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తరచుగా విమానం ప్రయాణం చేసే వారికి విమానం టేకాఫ్, ల్యాండింగ్ టైమ్ లో క్యాబిన్ లైట్లు డిమ్ కావడం గురించి తెలిసే ఉంటుంది. వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడమే కాడు, కీలకమైన భద్రతా చర్యల్లో భాగంగా అలా చేస్తారు.
భద్రత మరింత మెరుగు
విమానంలో క్యాబిన్ లైట్లను డిమ్ చేయడం అనేది ప్రాథమికంగా భద్రతా చర్యల్లో ఒకటి. లైట్లు డిమ్ అయినప్పుడు ప్రయాణీకుల కళ్ళు చీకటి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అవుతాయి. అలాగే, విమానం ముందున్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకునేందుకు పైలెట్ కు ఉపయోగపడుతుంది. డిమ్ లైట్ అనేది మన కళ్ళు పూర్తిగా సర్దుబాటు అయ్యేందుకు 10 నుంచి 30 నిమిషాల మధ్య సమయం పడుతుంది. ప్రయాణీకులు అప్పటిలోగా విమానంలోని పరిస్థితులకు అనుగుణంగా మారుతారు. అంతేకాదు, లైట్లను డిమ్ చేయడం ద్వారా,ఎలాంటి అవాంతరాలు లేకుండా విమానాన్ని టేకాఫ్ చేసే అవకాశం ఉంటుంది.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా..
డిమ్ లైట్ విజిబిలిటీ అనేది ప్రయాణీకులను మరింత సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రిపూట ఊహించని అత్యవసర పరిస్థితి సమవర్థవంతంగా ఎదుర్కొనేలా చేస్తుంది. డిమ్ లైట్ అనేది ప్రయాణీకులు త్వరగా గుర్తించి, ఆలస్యం చేయకుండా అత్యవసర విధానాలను అనుసరించేలా చేస్తుంది.
విమానాలలో యాష్ ట్రేలు ఎందుకు?
విమానాలలో పొగతాగడాన్ని అనుమతించరు. అయినప్పటికీ యాష్ ట్రేలు అమర్చబడి ఉంటాయి. దాని వెనుక ఓ పెద్ద కథ ఉంది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ ట్రేలను ఏర్పాటు చేస్తారు. విమానం క్యాబిన్ లో డిమ్ లైట్ ఉన్నప్పటికీ యాష్ ట్రేలు, విండో షేడ్లు విమాన సిబ్బందికి బయటి పరిస్థితులకు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. ఈ విజుబులిటీ అనేది భద్రత విషయంలో చాలా కీలకమైనది. ఇబ్బందికర పరిస్థితులలో సిబ్బంది ప్రయాణీకులకు సహాయ చర్యలు చేపట్టడంలో ఉపయోగపడుతుంది.
క్యాబిన్ లైట్లు డిమ్ కావడం, యాష్ ట్రేల ఏర్పాటు అనేది విమానంలో భద్రతతో పాటు పరిస్థితులను ప్రయాణీకులు అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడుతాయి. విమాన ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు ఇవి ఎంతగానో సాయం చేస్తాయి. అంతేకాదు, విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రయాణీకులను ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు ఆఫ్ లో ఉంచాలని సిబ్బంది ప్రయాణీకులకు సూచిస్తారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా విమాన సిగ్నల్స్ కు అంతరాయం కలిగే అవకాశం ఉండటం మూలంగా ఫోన్లు ఆఫ్ చేయాలని కోరుతారు.
Read Also: కేబుల్ బ్రిడ్జిపై రైలు.. చరిత్రలో ఇదే తొలిసారి, వీడియో చూస్తే మైండ్ బ్లాకే!