BigTV English

South Indian Food in Trains: రైళ్లలో సౌత్ ఇండియన్ ఫుడ్ ఎందుకు పెట్టరో తెలుసా?

South Indian Food in Trains: రైళ్లలో సౌత్ ఇండియన్ ఫుడ్ ఎందుకు పెట్టరో తెలుసా?

BIG TV LIVE Originals: రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పలు రైళ్లలో ప్రయాణీకులకు రుచికరమైన ఆహారం అందిస్తోంది. అయితే, ఈ ఆహార పదార్థాల్లో ఎక్కువగా సౌత్ ఇండియన్ ఫుడ్ కనిపించదు. నార్త్ ఆహార పదార్థాలే కనిపిస్తాయి. రైల్వే ఆహారం ఎందుకు దక్షిణాది ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? కావాలనే చేస్తుందా? ఏమనా ఇతర కారణాలు ఉన్నాయా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


రైళ్లలో సాధారణంగా ఏ ఫుడ్స్ అందిస్తారు?  

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ద్వారా భారతీయ రైల్వే ప్రయాణీకులకు ఫుడ్ అందిస్తోంది. రాజధాని, శతాబ్ది, దురంతో సహా సుదూర ప్రయాణం చేసే ప్రీమియం రైళ్లలో ఆహారాన్ని అందిస్తున్నారు. రైల్వే ప్రయాణీకులు అందించే ఫుడ్ లో పప్పు, రోటీ, రైస్, కూరగాయలు, పెరుగు ఉంటుంది. ఇవి దేశ వ్యాప్తంగా ప్రజలు సాధారణంగా తీసుకునే ఫుడ్స్. ఇక స్నాక్స్ లో భాగంగా సమోసాలు, కట్లెట్, టీ అందిస్తారు. కొన్ని రైళ్లలో చికెన్ కూడా అందిస్తారు. కానీ, సౌత్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఇడ్లీ, దోస, సాంబార్, ఉప్మా  రైల్వే మెనూలో ఉండవు. ఎందుకంటే..


⦿ ప్యాంట్రీ కార్ పరిమితులు

రైళ్లలోని ప్యాంట్రీ కార్లు చిన్నవిగా ఉంటాయి. సౌత్ ఫుడ్ తయారు చేయడానికి సరిపడ స్థలం, పరికరాలు ఉండవు. దోస లాంటి వంటకాలకు ఫ్లాట్ పాన్, పిండి అవసరం. ఈ పిండిన కదిలే రైలులో నిల్వ చేయడం, రెడీ చేయడం కష్టం అవుతుంది.  పప్పు,  రోటీ లాంటి నార్త్ ఫుడ్ ను పెద్ద మొత్తంలో వండటం, వడ్డించడం సులభం. ప్యాంట్రీ కార్లలో తరచుగా సరైన నిల్వ ఉండదు. అందుకే, సులభంగా చెడిపోని వంటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

⦿ ప్రామాణిక మెనూలు

ఇండియన్ రైల్వే తమ సిబ్బందికి మరింత ఇబ్బంది కలగకుండా అన్ని రైళ్లలో ఆహారాన్ని ఒకే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడే మెనుకూ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నార్త్ ఇండియన్ ఫుడ్ ను అందిస్తారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో సౌత్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడినప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అంతగా డిమాండ్ ఉండదనే ప్రచారం ఉంది.

⦿ లాజిస్టిక్స్, ప్రాంతీయ తేడాలు

సౌత్ ఫుడ్ తాజాగా ఉన్నప్పుడు రుచిగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలు, దోసెలు తింటనే టేస్టీగా ఉంటాయి. కానీ, రైళ్లలో ఆహారాన్ని తరచుగా బేస్ కిచెన్‌ లలో ముందే వండుతారు. ఆ తర్వాత రైళ్లలోకి తీసుకెళ్తారు. ప్రయాణీకులకు చేరే సమయానికి చల్లగా మారడం వల్ల రుచి తగ్గుతాయి. అంతగా ఇష్టపడరు. కర్రీ, రైస్, రోటీలాంటి ఫుడ్ తిరిగి వేడి చేయడానికి అవకాశం ఉంటుంది.  అలాగే, బేస్ కిచెన్‌లు దేశం అంతటా విస్తరించి ఉన్నాయి. కానీ, వాటిలో సౌత్ ఇండియన్ ఫుడ్ తయారు చేయడానికి అంతగా అనుకూలంగా లేవు.

⦿క్వాలిటీ విషయంలో ఫిర్యాదులు

గతంలో రైళ్లలోని ఆహార నాణ్యత గురించి ప్రయాణీకులు చాలా కంప్లైంట్స్ చేశారు. భోజనంలో బొద్దింకలు, గడువు ముగిసిన వస్తువులను ఉపయోగించడం లాంటి ఘటనలు ఎదురయ్యాయి. సౌత్ ఫుడ్ ను జాగ్రత్తగా తయారు చేయాల్సి ఉంటుంది. ఇడ్లీ కోసం పిండిని పులియబెట్టడం లాంటి పనులు ప్యాంట్రీ కార్లలో చేయడం సాధ్యం కాదు. మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, ఆ ఆహార పదార్థాలను మెనూలో చేర్చలేదు.

⦿ అంతగా డిమాండ్ లేకపోవడం!

సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ లో ఎక్కువగా ఇష్టపడినప్పటికీ, దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు అంతగా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో సౌత్ ఫుడ్ కు తగినంత డిమాండ్ లేదని కొంతమంది భావిస్తారు. కానీ, తేజస్ ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లలో దోస, ఇడ్లీలను అందిస్తారు. వాటికి ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. సౌత్ ఫుడ్స్ కు డిమాండ్ లేదనే మాట నిజం కాదు.

రైళ్లలో సౌత్ ఫుడ్ కూడా పొందే అవకాశం!

పాంట్రీ కార్లు సౌత్ ఇండియన్ అందించకపోయినా, ఆన్‌ లైన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. IRCTC ఇ-క్యాటరింగ్ ద్వారా ఇప్పుడు సౌత్ ఫుడ్ పొందవచ్చు. 2015 నుంచి IRCTC రైల్‌ రెస్ట్రో, జూప్, ట్రైన్స్‌కేఫ్ వంటి యాప్‌ ద్వారా ఇడ్లీ-సాంబార్, దోస, హైదరాబాదీ బిర్యానీ వంటి దక్షిణ భారత వంటకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  తేజస్ ఎక్స్‌ప్రెస్, మండోవి కొంకణ్ కన్యా ఎక్స్‌ ప్రెస్ లాంటి కొన్ని రైళ్లు సౌత్ ఇండియన్ ఫుడ్ ను అందిస్తాయి. తేజస్ లో బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, వడ, దోసె అందిస్తున్నారు. రాత్రి భోజనంలో కేరళ కూరలను కూడా అందిస్తున్నారు.

సౌత్ ఫుడ్స్ కు ప్రధాన్య ఇవ్వాలని డిమాండ్

రైల్వే మెనూలో సౌత్ ఫుడ్స్ లేకపోవడం నిజంగా పక్షపాతం అని కొంత మంది వాదిస్తున్నారు. ఇప్పటికైనా అన్ని రైళ్లలో సౌత్ ఫుడ్స్ ను అందుబాటులో ఉంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ నార్త్ లో ఇష్టపడకపోతే, కనీసం సౌత్ లో అయినా సౌత్ ఫుడ్స్ అందుబాటులో ఉంచాలంటున్నారు.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×