Jabardast Faima: పటాస్ ఫైమా అంటే బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయలేని పేరు. టెలివిజన్ రంగంలో కామెడీ ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బుల్లితెరపై వారి హవాని చూపిస్తున్నారు. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది ఫైమా. తనదైన పంచులు వేస్తూ, తన వాయిస్ తోనే నవ్వుని తెప్పించగల యాక్టర్ గా ఫైమా గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో తన టాలెంట్ నిరూపించుకొని ఆడియన్స్ కి దగ్గరయింది. ఫైమా వచ్చిందంటేనే ఓ రేంజ్ లో నవ్విస్తుందని.. ఆమెని స్క్రీన్ పై చూడగానే డైలాగ్ చెప్పక ముందే నవ్వొస్తుందని ప్రేక్షకులు చెబుతుంటారు. తాజాగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పటాస్ ప్రవీణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ప్రవీణ్ కి నాకు మధ్య జరిగింది అదే ..
ఫైమా జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది. పటాస్ షో చేసేటప్పుడు ప్రవీణ్ అదే షోలో మరో కంటెస్టెంట్ గా ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో అనుకున్నారు. ఇద్దరు కలిసి ఎక్కువగా కనిపించడం, వీడియోలు చేయడం, షోలకు కలిసి రావడంతో అది నిజమేనని ప్రేక్షకులు అనుకున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ఫైమా మాట్లాడుతూ.. ప్రవీణ్ మొదట షో నుండి నాకు పరిచయం. నా కష్టంలో వాడు ఉన్నాడు. నా హ్యాపీనెస్ లో వాడు ఉన్నాడు. ఇప్పటివరకు అయితే, మధ్యలో వచ్చిన జనాల మాటల వల్ల, నేను కొన్ని నెలలు మాట్లాడలేదు. నేను బాధపడి తనతో మాట్లాడలేదు గాని, తర్వాత మాట్లాడుకున్నాము. మొదట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ అయితే ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. మేమిద్దరం ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ గా అలానే ఉన్నాము. ఇప్పటికి, మా ఇద్దరి మధ్య గొడవ అంటూ ఏదీ జరగలేదు. పక్కన వాళ్ళ మాటలు వల్ల నేను ప్రవీణ్ తో మాట్లాడలేదు’ అంతే అని ఫైమా తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా ఇప్పటివరకు పటాస్ ప్రవీణ్ కు, ఫైమాకు మధ్య గొడవకు ఎన్నో కారణాలు ఉన్నాయి అని ఊహించుకున్న వారికి ఈమె సరైన సమాధానం ఇచ్చారని అభిమానులు అంటున్నారు. వీరి స్నేహం ఎప్పటికి ఇలానే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు.
ఇప్పటికి వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు ..
ఇక ఫైమా ఎన్నో కష్టాల తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లలో తనదైన టాలెంట్ తో అవకాశాలని అందిపుచ్చుకొని అభిమానులను అలరిస్తున్నారు. ఈటీవీ ప్లస్ లో రవి, శ్రీముఖి యాంకర్స్ గా చేసే పటాస్ ప్రోగ్రాంలో ఫైమాను పంచ్ లతో అదరగొట్టింది. ఈ ప్రోగ్రాంలో మధ్యలో కొంతసేపు వచ్చి నవ్వించి వెళ్ళిపోయేది. ఆమె కామెడీ టైమింగ్ ని గమనించిన రవి ఆమెకు పటాస్ 2 లో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రోగ్రామ్స్లో పాల్గొంటూనే ఉన్నారు. పటాస్ పై మాగా పేరును తెచ్చుకున్నారు. ఈమె 2022లో బిగ్బాస్ సీజన్ సిక్స్ లో 17వ కంటెంట్ గా కనిపించింది. ఈ షోలో బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తూ ఎంటర్టైన్మెంట్ స్కిట్స్ తో ఆమె షోలో చేసిన సందడి, ఆమెను మంచి కంటెంస్టెంట్ గా నిలబెట్టాయి. అయితే ఆమె సీజన్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ తో కలిసి ఎన్నో ఎపిసోడ్ల లో నటించారు. రవి శ్రీముఖి ఇప్పటికి ఆమెకి సపోర్టుగా ఉంటారని ఈ ఇంటర్వ్యూలో ఆమె తెలపడం విశేషం.
Hyper Aadi: నువ్వు పాడిన పాటేంటి.. చెప్పిన అర్థమేంటి సౌమ్య.. ఆది కౌంటర్ అదిరిందిగా..