Ashmita Karnani: చాలావరకు సినీ పరిశ్రమలో చేదు అనుభవాలు ఎదుర్కోని నటీమణులు ఉండరు. అయినా కొందరు ఆ అనుభవాలను ఓపెన్‌గా బయటపడితే.. కొందరు మాత్రం చెప్పకుండానే తమలోనే దాచుకుంటారు. కొన్నిసార్లు నటీమణులు తమంతట తాముగా అలాంటి విషయాలు బయటపెట్టకపోయినా.. ఇతరుల వల్ల అవి ఆటోమేటిక్‌గా బయటికి వచ్చేస్తాయి. ఒకప్పుడు సీరియల్ నటిగా, ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది అష్మిత. ప్రస్తుతం అటు వెండితెర, ఇటు బుల్లితెర రెండిటికీ దూరంగా ఉంటూ కేవలం యూట్యూబ్‌కే పరిమితమయ్యింది. అలాంటి అష్మిత మహేశ్ బాబు హీరోగా నటించిన ‘బాబీ’ సినిమా సమయంలో ఎదుర్కున్న చేదు అనుభవం గురించి బయటపెట్టింది.
నో ఫ్రెండ్‌షిప్స్
‘‘మహేశ్ బాబు హీరోగా నటించిన బాబీ సినిమాలో నేను ప్రకాశ్ రాజ్ భార్య పాత్రలో నటించాను. ఒక చిన్న బిట్‌లో మాత్రమే నేను కనిపిస్తాను. పని కోసం తపన పడుతున్నట్టుగా కనిపిస్తూ చాలామంది అడ్వాంటేజ్ చూపిస్తారు. నేను కేవలం ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నాకు పెద్దగా అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. అందులో మాత్రం నేనే వెళ్లి ఇరుక్కున్నాను. నేను అప్పుడే కాలేజ్ నుండి బయటికి వచ్చి ధైర్యం చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను. కాలేజ్‌లో లాగానే ఇక్కడ కూడా ఫ్రెండ్‌షిప్స్ అన్నీ ఉంటాయని అనుకున్నాను. కానీ అసలు ఇక్కడ ఫ్రెండ్‌షిప్స్ ఉండవని తెలుసుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది అష్మిత. పైగా తను అలాంటి కష్టమైన సందర్భం నుండి ఎలా బయటపడిందో కూడా తెలిపింది.
టెన్షన్ పడ్డాను
‘‘నేను సైలెంట్‌గా ఉంటే ఆ సందర్భం మరింత ఇబ్బందికరంగా మారుతుందని గమనించి ఏదో ఒక మాట్లాడుతూనే ఉన్నాను. ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇల్లు ఇంకా చాలా దూరం ఉందని చెప్పాను. అయినా అక్కడే కారు ఆపేశారు. అప్పుడే నాకు టెన్షన్ వచ్చింది. వెంటనే అక్కడ ఉండేవారంతా మిమ్మల్ని, నన్ను గుర్తుపడతారు, వీకెండ్ కలుద్దాం అని చెప్పాను. అక్కడ నుండి బయటపడాలి అన్న ఆలోచన మాత్రమే మైండ్‌లో ఉంది. అప్పటినుండి ఆయన కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు, మాట్లాడలేదు. అలాంటి అనుభవాలే చాలా నేర్పిస్తాయి. నేను వేరేలాగా రియాక్ట్ అయ్యింటే ఆ పరిస్థితి కూడా వేరేలాగా ఉండేదేమో’’ అని చెప్పింది అష్మిత.
Also Read: అర్ధరాత్రి, నా హోటల్ రూమ్‌లో ఆ వ్యక్తి.. చేదు అనుభవం చెబుతూ వణికిపోయిన నటి
చచ్చిపోవాలి అనిపించింది
తన డ్రీమ్ రోల్ గురించి అడగగా.. డ్రీమ్ రోల్‌లో నటించిన తర్వాతే తన కెరీర్‌కు గుడ్ బై చెప్పానని బయటపెట్టింది అష్మిత (Ashmita). ‘‘సీరియల్స్‌లో ఎక్కువగా ఏడ్చే పాత్రలే చేసేదాన్ని. కానీ అగ్నిసాక్షిలో మొదటిసారి విలన్‌గా కనిపించాను. ప్రేక్షకులు కూడా ఆ పాత్రలో నన్ను చూసి తిట్టడం స్టార్ట్ చేశారు. ఇంక నేను సక్సెస్ అనుకున్నాను. ఆ తిట్టడం కూడా నన్ను కాస్త ఎఫెక్ట్ చేసింది. చచ్చిపోతే బాగుంటుంది అనిపించే కామెంట్స్ కూడా నేను చదివాను’’ అని చెప్పుకొచ్చింది అష్మిత. తను ఎంటర్ అయినప్పుడు ఉన్న ఇండస్ట్రీకి, ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా మార్పు ఉందని, అందుకే తాను యాక్టింగ్ మానేశానని ఓపెన్‌గా చెప్పేసింది.