E-Paper
Advertisement

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!
Advertisement

Aravind Rongala Guinness Recognised Adventure: ఒక సాధారణ పట్టణం నుంచి బయలుదేరిన ఓ బైక్ రైడర్.. మంచు కొండలు, గడ్డకట్టే చలి, అత్యంత కఠిన పరిస్థితులను లెక్కచేయకుండా వేల అడుగుల ఎత్తులోని ప్రమాదకరమైన మార్గాన్ని చేరుకున్నాడు. లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి సవాలునైనా అధిగమించవచ్చని నిరూపించాడు. చివరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఆ బైక్ రైడర్ మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన అరవింద్ రొంగల. లద్దాఖ్‌ లోని ఉమ్లింగ్ లా పాస్‌ కు బైక్‌పై చేరుకుని గిన్నిస్ రికార్డును ఒడిసిపట్టుకున్నాడు.

19 వేల అడుగుల ఎత్తులో అత్యంత సాహసం!

సముద్ర మట్టానికి సుమారు 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన రహదారిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ రహదారిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఇంత ఎత్తులో వాతావరణ పరిస్థితులు సాధారణ ప్రాంతాలతో పోలిస్తే పూర్తి  భిన్నంగా ఉంటాయి. తక్కువ ఆక్సిజన్, మంచు, తీవ్ర చలి, అకస్మాత్తుగా మారే వాతావరణం ప్రయాణాన్ని మరింత కఠినంగా మారుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అరవింద్ తన బైక్ ప్రయాణాన్ని కొనసాగించి ఉమ్లింగ్ లా చేరుకున్నారు. లేహ్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం, ఆయనకు కేవలం ఒక టూర్‌ గా కాకుండా, చాలా కాలంగా అనుకున్న సాహస లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంగా మారింది.

గడ్డకట్టే చలిలో బైక్ రైడ్!

Advertisement

ఉమ్లింగ్ లా వైపు వెళ్లే కొద్దీ ఎత్తు పెరుగుతుంది. దాంతో గాలి తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరవింద్ ప్రయాణంలోనూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎత్తైన కొండ మార్గాలు, చలి, తక్కువ ఆక్సిజన్ వంటి సవాళ్లను అధిగమిస్తూ గమ్యాన్ని చేరుకున్నారు.

గిన్నిస్ రికార్డు అందుకున్న అరవింద్ గిన్నిస్  

ఉమ్లింగ్ లా దగ్గర తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ కు సంబంధించిన అధికారిక సర్టిఫికేట్‌ను అందుకున్నట్లు అరవింద్ తెలిపారు. అక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన వెల్ కమ్ బోర్డు దగ్గర గిన్నిస్ సర్టిఫికేట్‌ తో ఆయన దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తుని నుంచి అంతర్జాతీయ గుర్తింపు!

Advertisement

తుని పట్టణానికి చెందిన అరవింద్ రొంగల సాధించిన ఈ అడ్వెంచర్ రికార్డు ఆసక్తిని కలిగిస్తోంది. చిన్న పట్టణం నుంచి బయలుదేరి లద్దాఖ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ఎత్తైన రహదారిపై బైక్‌తో ప్రయాణించడం ఆయన సాహసానికి నిదర్శనంగా నిలుస్తోంది. అరవింద్ అరుదైన గుర్తింపు పట్ల ఆయన తల్లిదండ్రులు, స్నేహితులు, తుని ప్రముఖులు, బైక్ రైడింగ్‌ను ఇష్టపడేవారు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. అటు ఉమ్లింగ్ లా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అడ్వెంచర్ బైక్ రైడర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రతి ఏడాది చాలామంది బైకర్లు లద్దాఖ్‌లోని ఈ ఎత్తైన ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

Read Also: యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

Tags

Related News

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!

Big Stories

Advertisement
×