E-Paper
Advertisement

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!
Advertisement

IRCTC Train Ticket Booking: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ కు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ముందుగానే టికెట్ బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న ప్రయాణికులకు IRCTC వెబ్ సైట్ చుక్కలు చూపిస్తోంది. ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పది నిమిషాల్లోనే సీట్లు ఖాళీ?

ఉదయం 8 గంటల సమయంలో బుకింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని నిమిషాల పాటు సమస్యలు ఎదురవుతున్నాయి. సుమారు 8:10 వరకు అన్ని రైళ్లలో సీట్లు ‘రిగ్రెట్’ లేదంటే వెయిటింగ్ లిస్ట్‌లో కనిపిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్లు ఎలా అయిపోతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణ ప్రయాణికులు బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసేలోపే సీట్లు అందుబాటులో లేకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్లపై అనుమానాలు!

Advertisement

ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు అక్రమంగా టికెట్లు బుక్ చేస్తున్న ఏజెంట్లపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుకింగ్ ప్రారంభమైన తొలి నిమిషాల్లోనే టికెట్లు దక్కించుకునేందుకు కొందరు అక్రమ సాఫ్ట్‌ వేర్ లేదంటే అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇవి ప్రస్తుతం ఆరోపణలు, అనుమానాల స్థాయిలోనే ఉన్నాయి. సంబంధిత వ్యవస్థలు పరిశీలించి వాస్తవ కారణాలను నిర్ధారించాల్సి ఉంటుంది.

తొలి 15 నిమిషాల్లో ఏజెంట్లకు నో ఎంట్రీ!

ఉదయం 8 గంటల నుంచి 8:15 గంటల వరకు సాధారణ ప్రయాణికులకు ముందస్తు బుకింగ్‌లో ప్రాధాన్యత కల్పించే విధానం ఉంది. ఈ సమయంలో రైల్వే ఏజెంట్లు టికెట్లు బుక్ చేయడానికి అనుమతి ఉండదు. అయినప్పటికీ బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్లు అందుబాటులో లేకపోవడం పలు ప్రశ్నలకు కారణమవుతోంది.

ఇంటర్నెట్ వేగమే కారణమా?

Advertisement

టికెట్ బుకింగ్‌లో ఇంటర్నెట్ వేగం కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, అదే ప్రధాన కారణమని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పటికీ టికెట్ దక్కకపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయని ప్రయాణికులు అంటున్నారు.

పండుగ సీజన్‌లో లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లపై ఆధారపడుతున్న నేపథ్యంలో, బుకింగ్ వ్యవస్థను మరింత పటిష్టంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. టికెట్లు నిజంగా ఏ కారణంతో అయిపోతున్నాయి? సాంకేతిక సమస్యలేనా? లేక అక్రమ సాఫ్ట్‌ వేర్ వినియోగం ఉందా? అనే విషయాలపై సమగ్ర పరిశీలన జరిగితేనే ప్రయాణికుల సందేహాలకు స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Read Also: దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

Tags

Related News

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!

పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు.. దసరా వేళ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!

LNG రైలు vs హైడ్రోజన్ రైలు.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే!

Big Stories

Advertisement
×