E-Paper
Advertisement

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?
Advertisement

Railway facilities: రైలు ప్రయాణం అంటేనే ఎంతో ఉత్సాహం. కానీ.. మనం ఎక్కాల్సిన రైలు అనుకోకుండా గంటల తరబడి ఆలస్యమై, అదీ అర్ధ రాత్రి సమయంలో ఒక పెద్ద రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా వెయిట్ ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఒంటరిగా లేదా కుటుంబంతో.. ప్రయాణించే మహిళలకు ఈ పరిస్థితి కాస్త ఆందోళన కలిగించొచ్చు. అయితే.. ఇలాంటి సమయాల్లో మహిళల భద్రత, సౌకర్యం కోసం ఇండియన్ రైల్వేస్ అనేక అద్భుతమైన సదుపాయాలను కల్పిస్తోంది. అవేంటో వివరంగా చూద్దాం!

పూర్తి ఫీచర్లు:

1. ప్రత్యేక మహిళా వెయిటింగ్ రూమ్స్:

పెద్ద, చిన్న రైల్వే స్టేషన్లలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘ లేడీస్ వెయింట్ రూమ్స్’ లేదా ‘ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు’ ఉంటాయి. రాత్రి వేళల్లో.. జనం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా రైలు బాగా లేట్ అయినప్పుడు బయట ప్లాట్‌ఫారమ్‌లపై కూర్చోవడానికి బదులుగా ఈ వెయిటింగ్ రూమ్‌లను ఉపయోగించుకోవడం బెస్ట్. ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి కుర్చీలు, మంచాలు , క్లీన్ వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉంటాయి. సాధారణ వెయిటింగ్ రూమ్స్ ఫ్రీగా లభిస్తే, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ లలో గంటకు రూ. 50 నుంచి రూ.150 వరకు నామినల్ ధరలతో ప్రీమియం ఫెసిలిటీలు దొరుకుతాయి.

2. ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది:

Advertisement

రాత్రి సమయాల్లో.. మహిళా ప్రయాణికుల సేఫ్టీ కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘మేరీ సహేలీ’అనే బృందాన్ని ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్‌లోని.. ప్లాట్‌ ఫారమ్‌లపై లేదా వెయిటింగ్ రూమ్‌లలో.. ఒంటరిగా ఉన్న మహిళలకు ఈ ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది ప్రత్యేక భద్రత కల్పిస్తారు. మీకు ఏ సమయంలోనైనా .. సహాయం కావాలంటే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 కి కాల్ చేయెచ్చు. కాల్ చేసిన నిమిషాల్లోనే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది మీ వద్దకు చేరుకుని సహాయం అందిస్తారు.

3.క్లాక్ రూమ్స్, సేఫ్ లాకర్స్ :

రైలు చాలా ఆలస్యంగా వస్తున్నప్పుడు, ఎక్కువ లగేజీని మోసుకుంటూ స్టేషన్ అంతా తిరగడం చాలా కష్టం. దీని కోసం దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ‘Cloak Rooms’, కంప్యూటరైజ్డ్ లాకర్స్ ఉంటాయి. మీ లగేజీని భద్రంగా ఈ లాకర్లలో ఉంచుకోవచ్చు. దీనికోసం సాధారణంగా 24 గంటలకు సుమారు రూ. 20 నుంచి రూ. 50 వరకు నామినల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. దీని వల్ల లగేజీ టెన్షన్ లేకుండా ఉండొచ్చు.

4.రిటైరింగ్ రూమ్స్ , పాడ్ హోటల్స్:

Advertisement

రైలు కనీసం 6 నుంచి 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం లేట్ అయితే.. స్టేషన్ బయటకు వెళ్లకుండానే స్టేషన్ లో ఉండే రిటైరింగ్ రూమ్స్  లేదా డార్మిటరీ బుక్ చేసుకోవచ్చు. IRCTC వెబ్‌ సైట్ లేదా యాప్ ద్వారా వీటిని ఆన్‌లైన్‌లో ముందుగానే.. లేదా స్పాట్‌లో బుక్ చేసుకోవచ్చు. వీటి ధరలు ఏసీ, నాన్-ఏసీని బట్టి సుమారు రూ. 300 నుంచి రూ. 1500 వరకు ఉంటాయి. అంతేకాకుండా.. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై లాంటి ప్రధాన స్టేషన్లలో సరికొత్త ‘పాడ్ హోటల్’ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం గంటల చొప్పున, చాలా తక్కువ ధరకే (రూ.300-రూ. 600) ప్రైవేట్ స్లీపింగ్ క్యాబిన్‌లను అందిస్తాయి.

Also Read:  కారుపై ‘L’ అని ఉందా? ఈ ట్రాఫిక్ రూల్స్ మీకు తెలియకపోతే నష్టం తప్పదు!

5. శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్లు:

రాత్రి వేళల్లో అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోతే స్టేషన్‌లోని Medical Emergency Booths లేదా ఫస్ట్ ఎయిడ్ వాడుకోవచ్చు. అలాగే.. మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం దాదాపు అన్ని ప్లాట్‌ఫారమ్‌లు, లేడీస్ వెయిటింగ్ రూమ్‌లలో సానిటరీ నాప్ కిన్ మెషీన్స్ ఇన్సైనరేటర్లు ఏర్పాటు చేశారు. వీటిని కేవలం రూ.5 లేదా రూ.10తో ఉపయోగించుకోవచ్చు.

రైలు ఆలస్యమైనప్పుడు కంగారు పడకుండా.. రైల్వే స్టేషన్‌లో ఉన్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే మీ నైట్ జర్నీ ఎంతో సురక్షితంగా,హాయిగా గడిచిపోతుంది!

Related News

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

పండుగ రద్దీ వేళ రైల్వే గుడ్‌న్యూస్.. పలు రైళ్లకు అదనపు కోచ్‌లు!

రైలు టికెట్ ఉంటే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ పాటించాల్సిందే!

పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు.. దసరా వేళ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×