E-Paper
Advertisement

రేషన్ కార్డుల పంపిణీపై రాజకీయాలా.. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్!

రేషన్ కార్డుల పంపిణీపై రాజకీయాలా.. బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్!
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణలో ఇస్తున్నట్టు దేశంలో సన్నబియ్యం పంపిణీ ఎక్కడ లేదని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. 3 కోట్ల 42 లక్షల మందికి 14800 కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, BRS ప్రభుత్వంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉంటే 2 కోట్ల 80 లక్షల మందికి ఇచ్చారని గుర్తు చేశారు. రేషన్ కార్డు ప్రక్రియ నిరంతర ప్రక్రియ BRS పార్టీలోని నేతలు పదే పదే అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు.

తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేకం..

మెడిగడ్డ, సుందిళ్ళ నుంచి చుక్క నీరు తీసుకోకుండా దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించామని, వరి కొనుగోళ్లలో 90 వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేశాంమన్నారు. ఈ రోజు సంగారెడ్డి చరిత్రలోనే కాదు తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేక రోజుగా ఏర్పడబోతుందని కొనియాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు.

Advertisement

Also Read: జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం…మా లంక ప్లేయ‌ర్ల‌కు మాన‌వ‌త్వం లేదంటూ సంగ‌క్క‌ర్ ఫైర్‌!

BRS హయాంలో.. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సుమారు కోటి 6 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని, BRS హయాంలో రేషన్ కింద దొడ్డు బియ్యం ఇచ్చారని అన్నారు. అప్పుడు ఆ బియ్యాన్ని ఎవరు తినకుండా కిలో 10 రూపాయలకు అమ్ముకునే వారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక సన్న వడ్లకి రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, నాణ్యత ఉన్న సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి ఉత్తం అన్నారు.

Advertisement

Also read: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం కాదు.. మీ ఆత్మగౌరవం: సీఎం రేవంత్!

Tags

Related News

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ హెచ్చరిక.. రద్దు కాబోతున్న సంక్షేమ పథకాలు ఇవే!

రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం కాదు.. మీ ఆత్మగౌరవం: సీఎం రేవంత్!

మల్లారెడ్డీ.. దమ్ముంటే రాజీనామా చెయ్! తోటకూర వజ్రేష్‌యాదవ్‌ సవాల్

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల భూమిని కాజేసేందుకు.. బిగ్ స్కెచ్చేసిన అక్రమార్కులు!

ఏపీకి గట్టి షాకిచ్చిన తెలంగాణ.. కృష్ణా నీళ్ల పంపకాలపై షాకింగ్ ట్విస్ట్!

బీఆర్ఎస్ భూ కేటాయింపులపై సర్కార్ ఉక్కుపాదం.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశం!

అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు! కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

Big Stories

Advertisement
×