Secunderabad- Visakhapatnam Vande Bharat Express: దేశ వ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి కనీవినీ ఎరుగని రెస్పాన్స్ వస్తోంది. వందేభారత్ రైళ్లు నడుస్తున్న అన్నిరూట్లలో వంద శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 5 వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. అన్ని రైళ్లలోనే వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తున్నది. రెండు రోజుల క్రితం విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్(20833/20834) ఎక్స్ ప్రెస్ రైలు కోచ్ ల సంఖ్య పెంచగా, తాజాగా మరో వందేభారత్ రైలు కోచ్ ల సంఖ్య పెంచింది సౌత్ సెంట్రల్ రైల్వే.
8 కోచ్ ల నుంచి 16 కోచ్ లకు పెంపు
విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య రాకపోకలు కొనసాగిస్తున్న వందేభారత్ (20707/20708) ఎక్స్ ప్రెస్ లో కోచ్ ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరిగినట్లు తెలిసింది. తాజాగా ఇవాళ సికింద్రాబాద్ నుంచి పెరిగిన కోచ్ లతో వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖకు బయల్దేరింది. ఈ రైలును 2024 మార్చి 12న ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, చైర్ కార్ కోచ్ లు 7 ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ కోచ్ లు 2కి పెరగ్గా, చైర్ కార్ కోచ్ లు 14కు పెరిగినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఓ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కోచ్ లు సంఖ్య పెంపు
అటు విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి ఈనెల 11 నుంచి కోచ్ ల సంఖ్య పెరిగింది. గతంలో 16 కోచ్ లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 20కి పెరిగింది. ఇందులో 18 చైర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. విశాఖపట్నంలో ప్రతి రోజు ఉదయం 5.45 గంటలకు బయల్దేరే ఈ వందేభారత్(20833) ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. అటు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి ఈ వందేభారత్(20834)ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం 20 కోచ్ లతో నడుస్తున్నది. గతంలో 1,128 సీట్లు ఉండగా, అదనపు కోచ్ లు యాడ్ కావడంతో ఆ సంఖ్య 1,440 వరకు పెరిగిందని అధికారులు తెలిపారు.
Train No.20707 Secunderabad – Visakhapatnam #VandeBharatExpress departs Secunderabad with 16 coaches (earlier train run with 8 coaches have been doubled to run with a composition of 16 coaches) this additional augmentation enables clearing the extra rush of passengers #Sankranthi pic.twitter.com/HkCOYxXp68
— South Central Railway (@SCRailwayIndia) January 13, 2025
Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు ఇవే, రోజూ ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తారో తెలుసా?
పండగకు వెళ్లే ప్రయాణీకుల సంతోషం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్- విశాఖపట్నం-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించిన సీట్ల సంఖ్య పెంచడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు పండుగ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని అన్ని వందేభారత్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: ఢిల్లీ నుంచి కాదా? కాశ్మీర్ వందే భారత్ స్లీపర్ రైల్ ప్రయాణికులకు ఊహించని షాక్, అక్కడే ఎక్కాలట!