Pak – ICC: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ డిమాండ్లకు ఐసీసీ దిగివచ్చింది. రిఫరీ ఆండీ పైన విచారణ చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మధ్య… ఇవాళ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. షేక్ హ్యాండ్ వివాదంలో అసలు ముద్దాయి రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ( ANDY PYCROFT)… అంటూ పాకిస్తాన్ సంచలన ఆరోపణలు చేసింది. అతని వెంటనే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి తొలగించి కొత్తవారిని తీసుకోవాలని డిమాండ్ కూడా పెట్టింది.
Also Read: Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర
పాకిస్తాన్ మొండి పట్టు పట్టి… దుబాయ్ స్టేడియానికి రాకుండా హోటల్ రూమ్ లోనే ప్లేయర్లను ఉంచింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకు… పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరూ కూడా… స్టేడియానికి వెళ్లకుండా హోటల్ రూమ్ లోనే ఉండిపోయారు. అటు యూఏఈ జట్టు పాకిస్తాన్ కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఐసీసీ ముందు… షేక్ హ్యాండ్ వివాదాన్ని ముందు ఉంచింది పాకిస్తాన్. సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వెంటనే రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చర్యలు తీసుకోవాల్సి ఉండేదని… కానీ ఆ విషయంలో రిఫర్ వదిలేసాడని పాకిస్తాన్ అసలు ఆరోపణ. అందుకే అతన్ని ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ పెట్టింది. అయితే మ్యాచ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో… ఐసీసీ దిగి రావాల్సి వచ్చింది. వెంటనే సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన షేక్ హ్యాండ్ వివాదం పైన… విచారణ జరిపించాలని ఆదేశాలు ఇచ్చింది. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ని విచారణ చేయాల్సిందేనని.. ఐసీసీ స్పష్టం చేసింది. ఈ సంఘటనపై క్షమాపణలు కూడా చెప్పించింది ఐసీసీ. ఆండీ క్షమాణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో యూఏఈ తో మ్యాచ్ కు పాకిస్తాన్ సిద్ధమై గ్రౌండ్లో అడుగుపెట్టింది.
వివాదం ముగిసిన నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఒకవేళ ఈ మ్యాచ్ పాకిస్తాన్ ఆడకుండా బైకాట్ చేస్తే.. కచ్చితంగా యూఏఈ సూపర్ ఫోర్ కు వెళ్లేది. కానీ పాకిస్తాన్ మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన యూఏఈ… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక మరికాసేట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), ఖుష్దిల్ షా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI): అలీషాన్ షరాఫు, ముహమ్మద్ వసీమ్(సి), ఆసిఫ్ ఖాన్, ముహమ్మద్ జోహైబ్, హర్షిత్ కౌశిక్, రాహుల్ చోప్రా(w), ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, ముహమ్మద్ రోహిద్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్, జునైద్ సిద్ధిక్
🚨 REFEREE ANDY PYCROFT PUBLICLY APOLOGISED TO PAKISTAN CRICKET TEAM!🚨
Brilliant job by PCB pic.twitter.com/Mo6F3HsCx4
— junaiz (@dhillow_) September 17, 2025
🚨 ICC AGREES TO INQUIRY AGAINST ANDY PYCROFT FOR CODE OF CONDUCT VIOLATION ON SEPTEMBER 14 MATCH pic.twitter.com/MIKnjAVXhF
— junaiz (@dhillow_) September 17, 2025