BigTV English

Maldives: మునిగిపోతున్న మాల్దీవులు? పాపం, మనవాళ్లంతా ఏమైపోవాలి?

Maldives: మునిగిపోతున్న మాల్దీవులు? పాపం, మనవాళ్లంతా ఏమైపోవాలి?

మాల్దీవులు. ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సెలబ్రిటీలతో పాటు పలువురు మాల్దీవులలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటులు మాల్దీవుల్లో షికార్లు చేసేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది ధనవంతులు హనీమూన్ కు వెళ్లేందుకు మాల్దీవులను ఎంచుకుంటారు. అక్కడి బీచులలో హ్యాపీగా జాలీగా ఎంజయ్ చేస్తుంటారు. అక్కడి అందమైన వాతావరణం పర్యాటకులను అమితంగా ఆటకట్టుకుంటుంది.


మాల్దీవ్స్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్

ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఇష్టపడే మాల్దీవ్స్.. 2100 నాటికి మాయం అవుతాయంటున్నాయి తాజా నివేదికలు. వచ్చే ఏడున్నర దశాబ్దాల్లో మాల్దీవులు పూర్తిగా సముద్రం గర్భంలో కలిసిపోతాయంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మాల్దీవులతో పాటు మరికొన్ని ద్వీపాలు పూర్తి కనుమరుగు అవుతాయంటున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు మాల్దీవులు ప్రభుత్వం కొత్త భూమిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. అయితే, ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.


2100 నాటికి మాల్దీవుల్లోని దీవులు పూర్తిగా మునిగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లు నేచర్ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. మాల్దీవ్స్ లోని ద్వీపాలు 80 శాతం వరకు సముద్ర మట్టానికి కేవలం ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి.   ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టం సంవత్సరానికి మూడు నుండి నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో  2050 నాటికి లోతట్టు ద్వీపాలు మాయం అవుతాయని వెల్లడిచింది. మాల్దీవ్స్ లోని 1200 ద్వీపాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది.

మాల్దీవులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?

సముద్రమట్టం పెంపు ద్వారా మాల్దీవులు మునిగిపోకుండా అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సముద్రాన్ని పూడ్చుతూ కొత్త భూమిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను మట్టితో నింపి నేలను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నది.  ఇందుకోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు ‘రాస్ మాలే’ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది మాల్దీవుల్లో కృత్రిమంగా భూ విస్తరణ కోసం చేపట్టిన కార్యక్రమం.  ఎల్ మావా ఇస్లాన్‌లో 30 హెక్టార్ల భూమిని సృష్టించనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది మార్చిలో ఫెలిధూ ద్వీపానికి సంబంధించిన భూ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రకటించాడు.

అటు నేచర్ నివేదిక ప్రకారం మాల్దీవులు  కృత్రిమంగా భూమిని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. గత ఐదు దశాబ్దాల్లో మాల్దీవులు చాలా భూమిని తిరిగి సృష్టించినట్లు తెలిపింది. అయితే, కృత్రిమంగా భూమిని నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు, కృత్రిమంగా భూమిని నిర్మించడం వల్ల సముద్ర జీవులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిషింగ్, టూరిజం పరిశ్రమలకు చాలా ప్రమాదకరం అంటున్నారు. అయితే, కృత్రిమ భూ నిర్మాణం కొనసాగితే కొంత మేర మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందంటున్నారు మాల్దీవ్స్ ప్రభుత్వం పెద్దలు.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా మాల్దీవులతో పాటు పలు ద్వీపాలు మునిగిపోయే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అలాంటి వాటిలో ఫిజీ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరగడం వల్ల ఈ ద్వీపం కనుమరుగు కానుందంటున్నారు.

Read Also: మేఘాలపై మనుషులు.. విమాన ప్రయాణికులకు వింత అనుభవం, వీడియో వైరల్!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×