Game Changer: పాన్ ఇండియా సినిమా అంటే ప్రతీ భాషలో విడుదల చేయడం మాత్రమే కాదు.. ప్రతీ భాషలో అదే రేంజ్‌లో ప్రమోషన్స్ కూడా చేయాలి. అందుకే కష్టమైన కూడా పాన్ ఇండియా సినిమా మేకర్స్ అంతా ప్రతీ రాష్ట్రానికి వెళ్లి ప్రత్యేకంగా ప్రతీ భాషా ప్రేక్షకులను కలిసి తమ సినిమాను చూడమని రిక్వెస్ట్ చేసుకుంటారు. అలా ప్రమోషన్స్ చేయడం వల్లే తమ భాష సినిమా కాకపోయినా చాలామంది పరభాషా ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలను చూశారు. ఆదరించారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో అలా జరగడం లేదు. ఈ సినిమాకు కర్ణాటక ప్రేక్షకుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి మూవీ టీమ్ చేస్తున్న పొరపాట్లు కూడా కారణం కావొచ్చు.
లైట్ తీసుకున్నారా.?
రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆ మూవీ తర్వాత చరణ్.. ‘ఆచార్య’లో ఒక చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించాడు. కానీ దాదాపు మూడేళ్ల తర్వాత తను మెయిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. అందుకే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలాకాలం పాటు ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఎలాంటి అప్డేట్ అందించలేదు మేకర్స్. కానీ ఫైనల్‌గా జనవరి 10న విడుదల కానుందని ప్రకటించారు. అప్పటికీ కూడా ఈ మూవీ అదే రోజు విడుదల అవుతుందని చాలామంది నమ్మలేదు. ఫైనల్‌గా విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉన్నా ప్రమోషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
Also Read: ‘వార్ 2’లో ఎన్‌టీఆర్ పాత్ర అదే.! ఇలా అయితే ఫ్యాన్స్‌కు ఫీస్టే.!
బాయ్‌కాట్ చేయాల్సిందే
‘గేమ్ ఛేంజర్’ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఒకేసారి విడుదల కానుంది. తెలుగు హీరో, తమిళ దర్శకుడు కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ రెండు భాషల్లో ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే బాగుండేది. కానీ అలా జరగడం లేదు. దీంతో కర్ణాటకలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా జనవరి 10న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి మేకర్స్ సిద్దమవ్వడంతో అక్కడి ప్రేక్షకుల్లో ఆగ్రహం మొదలయ్యింది. అందుకే ఈ సినిమాను కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రమోషన్స్ లేవు
కర్ణాటకలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) విడుదల కావొద్దంటూ పోస్టర్లపై బ్లాక్ పెయింట్ వేస్తూ నిరసన తెలియజేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా కన్నడలో విడుదల కాలేదని, అలాంటిది కర్ణాటకలో కూడా ఈ మూవీని తెలుగులోనే విడుదల చేయడం ఏంటని అక్కడి ఆడియన్స్ వాపోతున్నారు. ఒకవేళ వారిని కాదని సినిమాను విడుదల చేసినా కూడా దాని తర్వాత పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అసలు ఇండియాలో ఈవెంట్స్ చేయకుండా నేరుగా అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లి ‘గేమ్ ఛేంజర్’ ఆడియో ఫంక్షన్ చేసుకొని వచ్చారు మేకర్స్. అప్‌కమింగ్ ప్రమోషన్ ఈవెంట్స్ కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నిర్వహిస్తున్నారు.
Karnataka people boycotting #GameChanger
Not even one update is released in kannada but movie is releasing in karnataka in telugu language @AlwaysRamCharan
Movie will face lot of consequences after release pic.twitter.com/QNlqoLgoh0
— Telugu Cinema Rules (@TeluguCineRules) January 3, 2025