Viral Video: రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లలో స్టంట్లు చేస్తూ ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ, ఇంకా చాలా మంది కుర్రాళ్లు అవేమీ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఓవైపు రైల్వే అధికారులు.. స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా లైట్ తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రైల్వే వంతెనపై ప్రమాదకరంగా పరిగెత్తిన యువకుడు
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు ప్రాణాలను డేంజర్ పెట్టి మరీ రైల్వే వంతెనపై పరిగెత్తాడు. ఇరుకైన పిల్లర్ ప్లేట్ పై కదులుతున్న రైలు పక్కన పరిగెత్తుతూ ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. రైల్లో ఉన్న మరో వ్యక్తి ఈ తతంగాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని యువకుడు, తెల్లటి చెక్డ్ షర్ట్, నీలిరంగు జీన్స్, చెప్పులు ధరించి కనిపించాడు. అతను నవ్వుతూ ఎలాంటి భయం లేకుండా రైల్లో నుంచి పిల్లర్ ప్లేట్ మీదికి దూకి రైలుతో పాటుగా ముందుకు పరిగెత్తాయి. అక్కడి నుంచి జారి పడితే కొన్ని మీటర్ల లోతులో పడిపోయే అవకాశం ఉంది. అయినా, తను ఎలాంటి భయం లేకుండా పరిగెత్తాడు. నది మీదుగా ఉన్న ఈ వంతెనపై రైలు నెమ్మదిగా కదులుతూ కనిపించింది.
वाह बेटा वाह तूने तो बॉलीवुड वालों को भी पीछे छोड़ दिया इतना खतरनाक एक्शन कर के
ऐसे लापरवाह लोगों पर कारवाही होनी चाहिए pic.twitter.com/TldMj0rbsr
— दिव्या कुमारी (@divyakumaari) July 31, 2025
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు యువకుడిపై నెటిజన్లు నిప్పుడు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వీడియో కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. చాలా మంది ఆయన చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. “ఇది ప్రమాదకరం మాత్రమే కాదు, బాధ్యతారహితమైన పని. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి పనులు చేయడం నిజంగా దారుణం” అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. “ఈ రోజుల్లో యువతీ యువకులు రీల్స్ తో సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ప్రయత్నిస్తున్నారు తప్ప, ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు” అని మరికొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి పనులు యువకులు మానుకోవాలి. ఎందుకంటే వారికి ఎంతో విలువైన భవిష్యత్ ఉందని గుర్తించాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఒకవేళ సదరు యువకుడు పోలీసులకు పట్టుబడితే.. తాను కాదు, అది ఏఐ క్రియేషన్ అని తప్పించుకునే ప్రమాదం ఉంది” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. అటు ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సదరు యువకుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: మెట్రోలోకి డ్రైవర్ లెస్ ట్రైన్స్ వచ్చేశాయ్, చూడ్డానికి భలే ఉన్నాయే!