BigTV English

Dangerous Trek In India: ఇండియాలోనే మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా?

Dangerous Trek In India: ఇండియాలోనే మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా?

Dangerous Trek In India: వేసవి కాలం వచ్చేసింది. ఈ సమయంలో చిన్న బ్రేక్ తీసుకొని అలా ఓ ట్రిప్ ప్లాన్ చేయాలని చాలా మందికి ఉంటుంది. అది కాస్త అడ్వెంచరస్‌గా ఉంటే ఇంకా బాగుంటుందని మరికొందరు అనుకుంటారు. అలాంటి వారికోసం మేఘాలయలో థ్రిల్లింగ్ ప్లేస్ ఉంది.


మేఘాలయలోని చిరపుంజీ సమీపంలో మావ్రింగ్‌ఖాంగ్ బ్యాంబూ ట్రెక్ ఉంది. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీన్ని ‘ఈస్ట్ స్కాట్లాండ్’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు, ఆకుపచ్చని కొండలు, సహజ సౌందర్యంతో నిండిపోయి ఉంటుంది.

ట్రెక్ ప్రత్యేకత
మావ్రింగ్‌ఖాంగ్ బ్యాంబూ ట్రెక్ చాలా అడ్వెంచరస్‌గా అనిపిస్తుంది. ఈ ట్రెక్ థ్రిల్లింగ్‌గా మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా పర్ఫెక్ట్ ప్లేస్. వెదురు వంతెనలు, సహజ రాతి నిర్మాణాలు, అందమైన జలపాతాలు ఆకట్టుకుంటాయి. ఈ ట్రెక్ సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దారిలో వెదురు నిచ్చెనలు, రాళ్లతో వాటంతట అవ్వే ఏర్పడిన మార్గాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. స్థానికంగా ఉండే ఖాసీ తెగలవారు వెదురు, తాళ్లతో ఈ ట్రెక్ మార్గాన్ని నిర్మించారట. చిన్న చిన్న గుండ్లు, నదులను దాటడానికి ఈ వంతెనలు ఉపయోగపడతాయి.


ప్రకృతి సౌందర్యం
చుట్టుపక్కల మొత్తం ఆకుపచ్చని చెట్లు, పక్షుల కిలకిల స్వరాలు, చల్లని గాలితో నిండి ఉంటాయి. ట్రెక్ చేస్తున్నంత సేపు ప్రకృతి అందాలను చాలా ఎంజాయ్ చేయొచ్చు. ట్రెక్ చివర్లో వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడి నుండి చిరపుంజీ లోయ మొత్తం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.

ఎప్పడు వెళ్తే బెటర్?
మావ్రింగ్‌ఖాంగ్ ట్రెక్‌కు వెళ్లాలనుకునే వారికి అక్టోబర్ నుండి మే వరకు బెస్ట్ టైం. అక్కడ ఈ సమయంలో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం పెద్ద సాహసం చేసినట్లే అవుతుంది. వర్షాల వల్ల వెదురు బాగా జరుతుంది. అందుకే వర్షాకాలంలో ట్రెక్ చేయడం కన్నా చలికాలం, వేసవి కాలంలోనే మావ్రింగ్‌ఖాంగ్ ట్రెక్‌కు వెళ్లడం మంచిది.

ALSO READ: ఇండియాలో ఈ టూరిస్ట్ ప్లేసెస్ చాలా సేఫ్..

ఎలా చేరుకోవాలి?
మావ్రింగ్‌ఖాంగ్ ట్రెక్‌కు వెళ్లాలి అనుకునే వారు ముందు షిల్లాంగ్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి చిరుపుంజీకి వెళ్లాల్సి ఉంటుంది. చిరపుంజీ నుండి మావ్రింగ్‌ఖాంగ్ సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి టాక్సీలు, బస్సులలో కూడా మావ్రింగ్‌ఖాంగ్ ట్రెక్‌కు చేరుకోవచ్చు.

ట్రెక్కింగ్ కోసం సౌకర్యవంతమైన బట్టలు, షూస్ రెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. చిరపుంజీలో సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి రెయిన్‌కోట్, గొడుగు వంటి వాటిని కూడా వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అయితే వెళ్లడానికి ముందు ట్రెక్ చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అనేవి తెలుసుకోవడానికి అక్కడ ఉండే టూరిస్ట్ గైడ్ లేదా హెల్ప్ లైన్ సెంటర్‌కు కాల్ చేయడం మంచిది.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×