Trains: ఇండియన్ రైల్వే గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేగంగా ప్రయాణాలు మాత్రమేకాదు ఒక్కోసారి దాని వెనుక విషాదం ఉంటుందని రైల్వే పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ముంబై సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లో గడిచిన 11 ఏళ్లలో దాదాపు 30 వేల మంది మృతి చెందారు. రోజుకి ఏడుగురు చొప్పున మృత్యువాత పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలేకాదు.. సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లో ఘటన జరుగుతున్నాయి. రీసెంట్‌గా మహారాష్ట్రలోని థానే సమీపంలో రద్దీగా ఉన్న రెండు స్థానిక రైళ్ల నుండి ప్రయాణికులు పడిపోయాడు. ఈ ఘటనలో GRP కానిస్టేబుల్‌తోపాటు నలుగురు ప్రయాణికులు మరణించారు. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు.
ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో ప్రతిరోజూ 75 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తుంటారు. రద్దీగా ఉండే లోకల్ రైళ్ల తలుపులకు వేలాడుతూ ప్రయాణికులు కనిపిస్తారు. ముంబై సిటీలో ఒక సాధారణ దృశ్యం. కొందరు యువకులైతే వాటిపై ఫీట్లు చేస్తున్న దృశ్యాలు హంగామా చేస్తున్న సందర్భాలు కోకొల్లలు.
ఈ ఘటన తర్వాత రైల్వేశాఖ అలర్ట్ అయ్యింది. ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జనవరి నాటికి ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో ఆటోమేటిక్ డోర్ క్లోజర్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రయాణికులకు ఇదొక శుభవార్త.
ALSO READ: రైల్వే న్యూరూల్స్.. ఇక స్లీపర్ నుంచి 2 ఏసీకి అప్‌గ్రేడ్ ఇలా చేసుకోవచ్చు
రైల్వే పోలీసుల రికార్డుల ప్రకారం గడిచిన 11 ఏళ్లలో ముంబై సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లో జరిగిన ఘటనల్లో 29 వేల 970 మంది మరణించారు. గాయపడిన బాధితుల సంఖ్య 30 వేలు పైమాటే. జనవరి 2014 నుంచి మే 2025 మధ్య రైల్వే పోలీసుల వద్దనున్న డేటాలో ఆయా విషయాలు బయటకు వచ్చాయి.
రైల్వే ట్రాక్‌లను ప్రయాణికులు దాటుతున్నప్పుడు 16 వేల మంది మరణించారు. మరో 3,369 మంది గాయపడ్డారు. రైల్వే స్తంభాన్ని ఢీకొని 103 మంది చనిపోయారు. అందులో 655 మంది గాయపడ్డారు. రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల అంతరాలలో పడి 147 మంది మృత్యువాత పడ్డారు. అందులో 125 మంది గాయపడ్డారు.
విద్యుత్ తీగలు తగిలి 181 మంది మరణించగా మరో 203 మంది గాయపడ్డారు. రైల్వే ట్రాక్‌లపై 676 మంది ప్రాణాలు కోల్పోగా ఐదుగురు ఆత్మహత్యకు ప్రయత్నించి గాయపడ్డారు. సోమవారం పుణె ఘటన తర్వాత రైల్వే శాఖ ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించింది. ఆశాాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఆ తరహా ప్రమాదాలను నియంత్రించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెల్సిందే.