Indigo Airlines: దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్.. అంతర్జాతీయంగానూ సత్తా చాటబోతోంది. ఇప్పటికే ఇండియా నుంచి పలు అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు నడిపిస్తుండగా, మరో రెండు నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించబోతోంది. ఇంతకీ ఈ కొత్త విమానాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తాయంటే..
మాంచెస్టర్, ఆమ్ స్టర్ డామ్ కు నాన్ స్టాప్ సర్వీసులు
ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ రెండు సుదూర విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు విమానాలు నాన్ స్టాప్ గా వెళ్తాయని వెల్లడించింది. జూలై 1న ముంబై నుంచి మాంచెస్టర్ కు నాన్ స్టాప్ విమానాలను ప్రారంభించనుంది. జూలై 2న ముంబై- ఆమ్ స్టర్ డామ్ కు నాన్ స్టాప్ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానాలను ఈ సుదూర విమాన సర్వీసుల కోసం ఉపయోగించనుంది. ఈ విమాన సర్వీసులు వారానికి మూడుసార్లు నడిపించనున్నట్లు ప్రకటించింది. కొత్త విమానాలు అందుబాటులోకి వస్తే భారత్- ఉత్తర ఐరోపా మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందించే ఏకైక క్యారియర్ గా ఇండిగో నిలువనుంది.
ఫ్రీ ఫుడ్, డ్రింక్స్..
ఇక ముంబై నుంచి మాంచెస్టర్, ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లే ప్రయాణీకుల ఇండిగో చక్కటి సౌకర్యాలు కల్పించనుంది. ఈ మార్గాల్లోని ప్రయాణీకులకు ఉచితంగా వేడి భోజనం తోపాటు డ్రింక్స్ అందించనున్నట్లు తెలిపింది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఇండిగో విమాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండిగో వెబ్ సైట్, మొబైల్ యాప్ తో పాటు ట్రావెల్ సైట్స్ ద్వారా ఈ ప్రయాణాలకు సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇండిగో.
యుకె- ఇండియా కనెక్టివిటీ మరింత బలోపేతం
ఇండిగో సంస్థ అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ నాన్ స్టాప్ విమాన ప్రయాణాలతో ఇండియా, యుకె మధ్య కనెక్టివిటీ మరింత మెరుగు కానుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక, విద్యా, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం కానున్నాయి. విద్యార్థులు, నిపుణులు, టూరిస్టులకు కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో వివరించింది.
Read Also: తలకోన To దూద్ సాగర్, దేశంలో కనువిందు చేసే జలపాతాలు!
6 బోయింగ్ వివానాల లీజు ఒప్పందం
తాజాగా ఆరు బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్లను లీజుకు తీసుకోవడానికి ఇండిగో.. నార్స్ అట్లాంటిక్ ఎయిర్ వేస్ తో ఒప్పందం చేసుకుంది. వాటిలో ఒకటి ఇప్పటికే ఢిల్లీ-బ్యాంకాక్ మార్గంలో నడుసతోంది. మిగతా విమానాలు మాంచెస్టర్, ఆమ్ స్టర్ డామ్ మధ్య ప్రారంభం కానున్నాయి. ఈ విమానాలు ఇండిగో యూరోపియన్ విస్తరణకు మద్దతుగా నిలువనున్నాయి. ఈ సంవత్సరం A321XLR, 2027 నాటికి A350-900 విమానాలను తీసుకునేందుకు ఇండిగో సంస్థ రెడీ అవుతోంది. ఈ విమానాలు యూరోపియన్ మార్కెట్లలోకి ఇండిగో వ్యూహాత్మక ఎంట్రీని సూచిస్తున్నాయి. వ్యాపారం, ప్రయాణం, ద్వైపాక్షిక సహకారానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Read Also: జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!