E-Paper
Advertisement

వర్షాకాలంలో జిడ్డు చర్మం, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా?

వర్షాకాలంలో జిడ్డు చర్మం, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా?
Advertisement

Monsoon skin care tips: వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడి మనసుకు హాయిగా అనిపిస్తుంది కానీ.. మన చర్మానికి మాత్రం అస్సలు నచ్చదు. ఎందుకంటే గాలిలో పెరిగే హ్యుమిడిటీ (తేమ) వల్ల ముఖం జిడ్డుగా మారడం, మొటిమలు రావడం, స్కిన్ ఇన్ఫెక్షన్లు రావడం చాలా కామన్. అందుకే.. ఈ సీజన్‌లో చర్మాన్ని మెరిసేలా, హెల్తీగా ఉంచుకోవడానికి స్పెషల్ కేర్ అవసరం. ఈ వర్షాకాలంలో మీ స్కిన్ గ్లో అస్సలు తగ్గకుండా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని సింపుల్ అండ్ క్రేజీ స్కిన్ కేర్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

క్లెన్సింగ్ అస్సలు మిస్ అవ్వద్దు:
వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ వల్ల చర్మ రంధ్రాలు సులభంగా బ్లాక్ అయిపోతాయి. దీని వల్ల డస్ట్, ఆయిల్ పేరుకుపోయి మొటిమలు వస్తాయి. అందుకే రోజుకు కనీసం రెండు సార్లు మంచి జెల్-బేస్డ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంపై ఉండే అదనపు జిడ్డును తొలగించి, ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.

Advertisement

సన్‌స్క్రీన్ మస్ట్:
చాలా మంది వర్షాకాలంలో ఎండ లేదు కదా అని సన్‌స్క్రీన్ లోషన్ రాయడం మానేస్తారు. కానీ ఆకాశం మబ్బుగా ఉన్నప్పటికీ హానికరమైన యూవీ కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ..ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా నాన్-గ్రీజీ, మ్యాట్ ఫినిష్ ఇచ్చే వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ను కచ్చితంగా వాడాలి.

లైట్ వెయిట్ మాయిశ్చరైజర్:
వాతావరణం జిడ్డుగా ఉందని మాయిశ్చరైజర్ స్కిప్ చేయడం పెద్ద తప్పు. స్కిన్ డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్ చాలా ముఖ్యం. అయితే ఈ సీజన్‌లో హెవీ క్రీమ్స్‌కు బదులుగా వాటర్-బేస్డ్ లేదా లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్స్ వాడడం వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ దొరుకుతుంది, జిడ్డుగా కూడా అనిపించదు.

Advertisement

ఎక్స్‌ఫోలియేషన్ ముఖ్యం:
వారానికి ఒకటి లేదా రెండుసార్లు చర్మాన్ని మైల్డ్ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ సమస్య తగ్గుతుంది.అయితే కెమికల్ స్క్రబ్స్ కంటే ఇంట్లోనే తయారు చేసుకునే శనగపిండి, కాఫీ పొడి వంటి సహజసిద్ధమైన ప్యాక్‌లు వాడడం వల్ల చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

కనీసం 8 గ్లాసుల నీళ్లు:
బయట చల్లగా ఉండటం వల్ల వర్షాకాలంలో దాహం తక్కువగా వేస్తుంది. కానీ శరీరం లోపలి నుండి హైడ్రేటెడ్‌గా ఉంటేనే చర్మంపై గ్లో వస్తుంది. అందుకే.. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయి స్కిన్ క్లియర్‌గా మారుతుంది.

మేకప్ తగ్గించండి:
ఈ సీజన్‌లో వీలైనంత వరకు హెవీ ఫౌండేషన్లు, లూజ్ పౌడర్లకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే.. వర్షంలో తడిస్తే మేకప్ పాడవడమే కాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఒకవేళ మేకప్ వేసుకోవాల్సి వస్తే వాటర్‌ప్రూఫ్, లైట్ వెయిట్ సీసీ క్రీమ్స్ లేదా టింటెడ్ మాయిశ్చరైజర్లను వాడండి.

స్కిన్ కేర్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, దీనిని ఒక రొటీన్‌లా క్రమం తప్పకుండా పాటించాలి. ఈ వర్షాకాలంలో మీ చర్మ తత్వానికి సరిపోయే ప్రొడక్ట్స్ ఎంచుకుంటూ, పైన చెప్పిన టిప్స్ ఫాలో అయితే వానాకాలంలో కూడా మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Related News

వర్షాకాలం స్పెషల్.. ఇమ్యూనిటీ పెంచే అల్లం-వెల్లుల్లి సూప్ రెసిపీ!

ప్రెజర్ కుక్కర్లలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? కొనే ముందు ఈ క్లారిటీ తెచ్చుకోండి!

అందితే జుట్టు అందకపోతే కాళ్లు.. ఈ తేదీల్లో జన్మించిన వారు అనుకున్నది ఎలాగైనా సాధిస్తారు

పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఈ రుచికరమైన హెల్తీ స్నాక్స్‌తో సమస్యకు చెక్

మనసంతా నువ్వే.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి ప్రేమించే భర్త పొందుతారు

మీ పిల్లలు హోంవర్క్ కోసం ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారా? ఈ దురలవాటు మాన్పించడానికి ఈజీ టిప్స్

ఉల్లిపాయ అలెర్జీ కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళ.. ఈ అలెర్జీ ఎంత ప్రమాదకరమంటే

Big Stories

Advertisement
×