కాస్మోపాలిటన్ నగరాల్లో యువతీ యువకులు పోష్ గా తయారవుతున్నారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడవడం, భుజాలపై చేతులు వేసుకుని వెళ్లడం ఈ రోజుల్లో కామన్ అయ్యింది. తాజాగా ఓ బయట ఎండగా ఉండటంతో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మెట్రో ఎక్కింది. ప్రయాణ సమయంలో ఆమె అతడి చేతులు పట్టుకుని నిలబడటంపై ఓ వ్యక్తి అభ్యంతరం చెప్పడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము తప్పు చేయకపోయినా అదోలా మాట్లాడ్డం బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. ఈ ఘటన హైదరాబాద్ మెట్రోలో జరగడంతో పట్ల చాలా మంది షాక్ అవుతున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తమకు ఎదురైన చేదు అనుభాన్ని సదరు యువతి రెడ్డిట్ వేదికగా వివరించింది. “ఆదివారం కావడంతో నేను, నా బాయ్ ఫ్రెండ్ అమీర్ పేట దగ్గర లంచ్ చేయాలి అనుకున్నాం. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది. బైక్ మీద వెళ్లడం కంటే మెట్రోలో వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. సరే అని బైక్ పార్కింగ్ ప్లేస్ లో పెట్టి మాదాపూర్ రైల్వే స్టేషన్ లో మెట్రో ఎక్కాము. అప్పటికే సీట్లు అన్నీ నిండిపోయాయి. ఇద్దరం నిలబడే ఉన్నాం. ఇద్దరం చేతులు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నాం”.
“సుమారు రెండు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి వచ్చి నా బాయ్ ఫ్రెండ్ తో “చేతులు తీయండి! ఇది అమెరికా కాదు” అంటూ గట్టిగా అరిచాడు. నేను షాక్ అయ్యాను. లైట్ తీసుకున్నాను. కానీ, నా బాయ్ ఫ్రెండ్ మళ్లీ నా చేయి పట్టుకున్నాడు. “నేను ఇలాగే పట్టుకుంటాను. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేసి, చదువుకున్న వ్యక్తిలా ప్రవర్తించు. నీ పని నీవు చూసుకో” అని ఎదురు సమాధానం చెప్పాడు. నాకు నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. మేం నెక్ట్స్ స్టాప్ లో దిగి మరొక రైల్లో అమీర్ పేటకు వెళ్లాలి అనుకున్నాం. నిజాయితీగా చెప్పాలటే ఈ సంఘటన నాకు చాలా బాధను కలిగించింది. చేతులు పట్టుకుని నిలబడటాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, పెద్ద విషయంగా రచ్చ చేయడం నాకు అస్సలు అర్థం కాలేదు” అని సదరు యువతి రాసుకొచ్చింది.
Got Yelled at in Hyderabad Metro for Holding Hands
byu/Senior-League-1009 inhyderabad
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
అటు ఈ ఘటనపై నెటిజన్లు సీరియస్ గా స్పందించారు. “ఇది అమెరికా కాకపోవచ్చు. కానీ, అప్ఘనిస్తాన్ కూడా కాదని సదరు వ్యక్తి తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మీరు ఎలాంటి తప్పు చేయలేదు. ఈ మధ్య కొంత మంది అతిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. మోరల్ పోలీసింగ్ ఎక్కువ అయ్యింది. మీకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం నిజంగా బాధాకరం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Read Also: ట్రైన్ లో ల్యాప్‌టాప్ మరిచిపోయిన రైల్వే అధికారి.. విజయవాడ సిబ్బంది చేసిన పనికి అంతా ఫిదా!