Hardik Pandya Instagram: మార్చ్ 9 ఆదివారం రోజున దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీని భారత్ గెలవడం ఇది మూడవసారి. ఇలా అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా భారత చరిత్ర సృష్టించింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ ట్రోఫీని గెలవడంతో అభిమానులతో పాటు భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: Andy Roberts on BCCI: ఇండియా-ICC మధ్య ఫిక్సింగ్.. అందుకే వరుసగా ట్రోపీలు ?
ట్రోఫీ గెలుచుకున్న అనంతరం భారత జట్టు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ ఇలా.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఛాంపియన్స్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఈ ట్రోఫీతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. ఈ పోస్ట్ కి ఆరు నిమిషాలలోనే మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో హార్దిక్ పాండ్యా ఇంస్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ రికార్డును దాటేశాడు.
గతంలో విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్ట్ కి ఏడు నిమిషాలలో మిలియన్ లైకులు వచ్చాయి. అయితే తాజాగా హార్దిక్ పాండ్యా ఛాంపియన్ ట్రోఫీతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ ఫోటో విరాట్ కోహ్లీ రికార్డును దాటేసింది. హార్దిక్ పాండ్యా కప్ ని పిచ్ పై ఉంచి.. కాబీలేమ్ స్టైల్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
” 2017 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా తో కలిసి ఆడుతున్నప్పుడు రన్ అవుట్ అయ్యాను. అప్పుడు నేను సరిగ్గా ఆడ లేక పోయాను. కానీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ట్రోఫీ చాలా ముఖ్యం. నేను ఇంకా చాలా చాంపియన్షిప్ లు గెలవాలని అనుకుంటున్నాను. 2024 లో గెలిచినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. నాకు ఇది చాలదు. ఇంకా ఐదారు ట్రోఫీలు కావాలి.
Also Read: Gautam Gambhir: రిలాక్స్ లేదు… ఇంగ్లండ్ భరతం పట్టేందుకు గంభీర్ సంచలన నిర్ణయం !
ఇంకొకటి వచ్చి చేరినందుకు సంతోషంగా ఉంది. ఏ పరిస్థితులలోనైనా మా జట్టు గెలవాలి. మా జట్టుకు అంతా మంచే జరగాలి. నా జట్టు గెలవడానికి నేను ఎలా సహాయం చేయాలా అని చూస్తూ ఉంటాను. ఒకవేళ నేను సరిగ్గా ఆడకపోయినా.. నా జట్టు గెలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా చెట్టు సభ్యులు అంతా బాగా ఆడారు. నా తర్వాత లక్ష్యం ఇండియాలో జరిగే ఐసీసీ టి-20 వరల్డ్ కప్ ని గెలవడం” అని అన్నాడు.