Passengers Fighting: కారణాలు ఏమైనా కావచ్చు. విమానం ఆకాశంలో ఉండగా ప్రయాణికులు కొట్టుకున్నారు. షర్టులు సైతం చింపేకునే స్థాయిలో వారి మధ్య పోరాటం జరిగింది. వారిని విడిపించేందుకు తోటి ప్రయాణికులు తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టప్పటికీ వారు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం. ఇద్దరు ప్రయాణికుల మధ్య మాటలు కాస్త తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా కోపం, ఆవేశంతో ఒకరిపై మరొకరు పడి కొట్టుకున్నారు.. ఆపై షర్టులను చింపుకున్నారు. ఆ పరిణామాలను చూసిన పిల్లలు, వృద్ధుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పరిస్థితి చేతిదాటి పోవడంతో క్యాబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను చివరకు విడదీశారు. విమానంలో ఆకాశంలో ఉండగా ఈ ఘటన జరిగింది. బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మహబూబుద్దీన్ అహ్మద్ నోరు విప్పారు. ఆ సంఘటన గురించి తనకు ఇంకా తెలియదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. ఆ ప్రయాణికులు ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారు? పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన ఇండిగో.. ధరల పెంపుతో షాకైన ట్రావెలర్స్
Mid-Air Brawl on Biman Bangladesh Airlines Flight.
A video showing two passengers involved in a physical fight aboard.
The flight was travelling from London to Dhaka when an argument between two male passengers reportedly escalated into a physical altercation, causing panic… pic.twitter.com/k0qOScmvlq
— Ashoke Raj (@Ashoke_Raj) September 17, 2026