E-Paper
Advertisement

ఇదేం రిస్క్ రా బాబూ.. కదులుతున్న రైలును ఎగబడి ఎక్కుతున్న జనం.. హర్ష్ గోయెంకా షాకింగ్ రియాక్షన్!

ఇదేం రిస్క్ రా బాబూ.. కదులుతున్న రైలును ఎగబడి ఎక్కుతున్న జనం.. హర్ష్ గోయెంకా షాకింగ్ రియాక్షన్!
Advertisement

Local Train Viral Video: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోకల్ రైళ్లలో ప్రయాణం ఎలా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రైళ్లలో జర్నీ చేసేందుకు చిన్నపాటి పోరాటమే చేయాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కడ, దిగడం పెద్ద సవాల్ గా చెప్పుకోవచ్చు. తాజాగా వేగంగా కదులుతున్న విరార్ ఫాస్ట్ లోకల్ రైలును ఎగబడి ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసి చాలా మంది షాకవుతున్నారు.

రన్నింగ్ ట్రైన్ వైపు ప్రయాణికుల పరుగులు

ఈ వీడియోలో లోకల్ రైల్వే స్టేషన్‌ లో పూర్తిగా ఆగకముందే కొందరు ప్రయాణికులు దాని వైపు పరుగెత్తుతున్నట్లు కనిపించింది. రైలు కదులుతుండగానే కొంత మంది వేగంగా ఎక్కుతూ కనిపించారు. ఏమాత్రం పరిస్థితి అటు ఇటు అయినా ప్రాణాలు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రయాణికులు రిస్క్ తీసుకుంటూ రైలు ఎక్కడానికి ఎగబడటం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హర్ష్ గోయెంకా షాకింగ్ రియాక్షన్  

Advertisement

ఈ వీడియోను దిగ్గజ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  ముంబై వెస్ట్రన్ లైన్‌ లో విరార్ ఫాస్ట్ రైలు అత్యంత రద్దీగా ఉండే సబర్బన్ సర్వీసుల్లో ఒకటని చెప్పుకొచ్చారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆయన లేవనెత్తారు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కొందరు ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదని సూచించగా, మరికొందరు రద్దీ వల్లే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నారని కామెంట్స్ చేశారు.

ఓ నెటిజన్ దేశంలో రెండు రకాల మనుషులు ఉన్నారని, కొద్ది మంది విలాసవంతమైన జీవితం గడుపుతుండగా, కోట్లాది మంది ప్రతిరోజూ ఇలాంటి సమస్యలతో పోరాడుతున్నారని చెప్పుకొచ్చాడు. ధారణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలని సూచించారు. ఈ పరిస్థితి మారాలంటే భద్రతా ప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాలను భారీగా పెంచాల్సిన అవసరం లేదన్నారు.

పరిష్కారం కోసం కీలక సూచనలు   

Advertisement

ఈ సమస్య తగ్గాలంటే విరార్ ఫాస్ట్ రైళ్ల రాకపోకలను పెంచాలని కొందరు నెటిజన్లు సూచించారు. అత్యాధునిక   సదుపాయాలు కలిగిన కొత్త రైళ్లను తీసుకురావాలంటున్నారు. అంతేకాదు, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. రైళ్లలో మరింత స్థలం ఉండేలా వెస్టిబ్యూల్‌ లతో అనుసంధానించిన కోచ్‌లను వినియోగించాలని కూడా సూచిస్తున్నారు. ముంబైలో రైల్వే రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే  చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి సరిపోవని నిపుణులు చెప్తున్నారు. ప్రయాణికుల భద్రతకు  ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైలు సర్వీసుల సంఖ్య పెంచడం, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యవసరమంటున్నారు.

Read Also:‘ఇరుముడి’ మూవీలోని ఈ లోకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఫిదా అయిపోతారు!

Tags

Related News

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

Big Stories

Advertisement
×