BigTV English

Summer Vacation: ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఉండే ఈ ప్లేసెస్‌లో ఎంజాయ్ చేయండి

Summer Vacation: ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఉండే ఈ ప్లేసెస్‌లో ఎంజాయ్ చేయండి

Summer Vacation: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చిన్న బ్రేక్ తీసుకొని అలా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. సమ్మర్‌లో హాలిడే తీసుకోవడానికి ఛాన్స్ దొరికినా ఎక్కడికి వెళ్లాలన్నా ఎండలు మండిపోతాయి. దీంతో హాలిడే ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అందుకే సమ్మర్‌లో కూడా కూల్ కూల్‌గా ఉండే ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అది కూడా ఎక్కడో కాదు. ఇండియాలో ఎండాకాలంలో కూడా చల్లగా ఉండే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్‌లో ఇవి ది బెస్ట్ అని చెప్పొచ్చు.


చల్లగా ఉండే ప్రదేశం అనగానే చాలా మందికి హిమాలయాలే గుర్తొస్తాయి. ఇక్కడ ఉండే పర్వతాలు మంచుతో కప్పడబడి ఉంటాయి. అందుకే హిమాలయాలు ఎనీ టైం కూల్‌గా ఉంటాయి. సమ్మర్‌లో చల్లటి ప్రదేశంలో ఉండాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఇది మాత్రమే కాకుండా ఎండాకాలంలో కూడా కూల్‌‌గా ఉండే ప్లేసెస్ ఇండియాలో ఇంకా ఏం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

శిమ్లా
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న శిమ్లా చాలా అందంగా ఉండే హిల్‌స్టేషన్. నేచర్ లవర్స్ చాలా ఇష్టపడే వాటిలో శిమ్లా అద్భుతమైన ప్రదేశం. ఇది చండిగఢ్ నుండి 4-5 గంటల దూరంలో ఉంటుంది. అక్కడికి ట్రెయిన్ లేదా బస్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ఇక్కడ బస చేయడానికి హోటల్స్, రెసార్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అందమైన ప్రకృతి మాత్రమే కాకుండా ఇక్కడ చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న క్రైస్ట్ చర్చ్, రాంచిల్ టెంపుల్, శ్రీ కకుల్లి హిల్ స్టేషన్‌ను కూడా చూడొచ్చు.


మనాలి
మనాలి కూడా హిమాచల్ ప్రదేశ్‌లో ఫేమస్ హిల్ స్టేషన్. ఇక్కడ అందమైన ప్రకృతి, అడవులు, పర్వతాలు ఉంటాయి. ఫ్రెండ్స్‌తో కలిసి అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఢిల్లీ నుంచి కూడా మనాలికి వెళ్లొచ్చు. మనాలిలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటైన హడింబా టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ గులాబోరీ గార్డెన్, సోలాంగ్ వ్యాలీ, ఓల్డ్ మనాలి టౌన్ కూడా చూడొచ్చు.

డార్జిలింగ్
డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్‌లో ఉండే ఒక హిల్ స్టేషన్. దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా పిలుస్తారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే UNESCO వరల్డ్ హరిటేజ్ సైట్‌గా గుర్తింపుపొందింది. ఇక్కడ ఉంటే చాయ్ ఎస్టేట్స్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉండే అందమైన నియోరా వ్యాలీ, అడవి, పర్వతాలు, ఎండాకాలంలో చల్లని వాతావరణం కారణంగా పర్యాటకుల ఎక్కువగా వస్తారు.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×