BigTV English

Salt: మీరు వాడే ఉప్పు సరైనదేనా ? ఇంతకీ.. ఎలాంటి ఉప్పు వాడుతున్నారు ?

Salt: మీరు వాడే ఉప్పు సరైనదేనా ? ఇంతకీ.. ఎలాంటి ఉప్పు వాడుతున్నారు ?

Salt: అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని గురించి చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు . కానీ.. సరైన ఉప్పును సరైన పద్ధతిలో ఉపయోగించడం ఆరోగ్యానికి ఖచ్చితంగా మేలు చేస్తుందని మీకు తెలుసా ? ఇలాంటి సమయంలోనే మీ ఆరోగ్యానికి ఏ ఉప్పు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్‌లో వివిధ ఉప్పు రకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ ఉప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుందని విషయం చాలా మందికి తెలియదు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఆరోగ్యానికి ఉత్తమమైన ఉప్పు:

రెగ్యులర్ వైట్ సాల్ట్:
శరీరంలోని అయోడిన్ లోపాన్ని తీర్చడంతో పాటు జీవక్రియ స్థాయిలు, పెరుగుదలకు క్రమం తప్పకుండా తెల్ల ఉప్పు తినడం అవసరం. ఆహారంలో ఉప్పు వాడకం సరైన జీర్ణక్రియకు అలాగే శరీర రక్తపోటు నియంత్రణలో ఉండటానికి ఉపయోగపడుతుంది.


పింక్ సాల్ట్:
పింక్ సాల్ట్‌లో కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం ,మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాపు, ఉబ్బసం, అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి గులాబీ రంగులోని ఉప్పును ఉపయోగించవచ్చు.

సెల్టిక్ ఉప్పు:
సెల్టిక్ ఉప్పు వాడకం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో పొటాషియం, మెగ్నీషియం కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం.

శరీరంలో ఎలక్ట్రోలైట్లను నిర్వహించడానికి మీరు మీ రెగ్యులర్ డైట్‌లో సెల్టిక్ సాల్ట్‌ను ఉపయోగించవచ్చు. హైబీపీతో ఇబ్బంది పడే వారిని, షుగర్ వ్యాధిగ్రస్తులకు సెల్టిక్ ఉప్పును తినమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

నల్ల ఉప్పు:
సలాడ్, పెరుగుతో సాధారణంగా ఉపయోగించే నల్ల ఉప్పు, ఆహార రుచిని పెంచుతుంది. అంతే కాకుండా.. నల్ల ఉప్పులో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మానికి కూడా మేలు చేస్తాయి.

అందుకే మీరు మీ ఆహారంలో నల్ల ఉప్ను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నల్ల ఉప్పులో ఉండే సల్ఫర్ కంటెంట్ ఆహార రుచిని పెంచుతుంది. అంతే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కానీ నల్ల ఉప్పును ఉపయోగిస్తున్నప్పుడు.. దాని పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముందుగా తెలుసుకోండి.

నల్ల ఉప్పు రక్తపోటును నియంత్రించడంలో  సహాయపడుతుంది.  నల్ల ఉప్పులో సోడియం పరిమాణం చాలా తక్కువ. సోడియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. అందుకే సాధారణ ఉప్పు కంటే నల్ల ఉప్పు మీకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: ఉక్కపోత వల్ల కిచెన్‌లో.. వంట చేయడానికి ఇబ్బంది పడుతున్నారా ?

సోడియం లేని కోషర్ ఉప్పు:
కోషర్ ఉప్పు గురించి మాట్లాడుకుంటే.. అందులో చాలా తక్కువ మొత్తంలో సోడియం ఉండటమే కాకుండా.. అయోడిన్ లేకుండా ఇది పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉంటుంది.

పెద్ద స్ఫటికాల రూపంలో వచ్చే కోషర్ ఉప్పును కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, తెల్ల ఉప్పు తగ్గించాలని సలహా ఇచ్చేవారికి ఉత్తమంగా పరిగణించబడుతుంది.

Related News

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Big Stories

×