BigTV English

Iran Nuclear bombs : ఆణు బాంబులు తయారీకి ఇరాన్ సిద్ధం – తన పవర్‌తో తొక్కిపడేస్తున్న డోనాల్డ్ ట్రంప్

Iran Nuclear bombs : ఆణు బాంబులు తయారీకి ఇరాన్ సిద్ధం – తన పవర్‌తో తొక్కిపడేస్తున్న డోనాల్డ్ ట్రంప్

Iran Nuclear bombs : ఇటీవల కాలంలో మధ్య ప్రాచ్యంలో ఇరాన్ పట్టు సడలిపోయింది. అది పెంచిపోషించిన హమస్ దాదాపు నాశనం కాగా, ఇజ్రాయిల్ దెబ్బకు ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలు కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే సొంతంగానే అణు బాంబులు తయారు చేసుకునేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ట్రంప్.. మరోసారి ఆంక్షల కొరడా ఝులిపించారు. ఆదేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విధించిన ఆంక్షలను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరాన్ పై అమెరికా ఆంక్షలకు అనుమతి ఇస్తూ.. ప్రెసిడెంట్ మెమోరాండంపై యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో.. ఇరాన్ మరోమారు ఆర్థిక పతనం వైపు అడుగులు వేస్తోంది.


అత్యంత ప్రమాదకర ఇస్లామిక్ ఉగ్రవాద దేశంగా రూపాంతరం చెందిన ఇరాన్.. సొంతంగా అణు బాంబులు ఉంటే ఆ ప్రాంతంలో ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తోంది. అందుకే.. భారీగా అణు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అణు బాంబుల తయారీకి కావాల్సిన శుద్ధ యురేనియం నిల్వల్ని భారీగా పెంచుకుంటున్న ఈ ఉగ్రదేశం.. దాంతో అణు బాంబుల్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా ఇంటిలిజెన్స్ బృందాలు.. ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల్ని పూర్తిగా నిరోధించాలని చూస్తున్నారు. ఆ దేశ ఆదాయ వనరుల్ని భారీగా నియంత్రించడం ద్వారా అణు కార్యక్రమాల్ని నిలిపివేసేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు.

విదేశీ విధానంలో ట్రంప్ అనుసరిస్తున్న ధోరణిని అంచనా వేసిన ఇరాన్.. ట్రంప్ ఆంక్షల హెచ్చరికలతో దిగొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో తమ దేశంలో నిర్వహిస్తున్న అణు సంబంధ కార్యక్రమాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆయన పంపే సందేశం కోసం తన అధికారులు వేచి చూస్తున్నారంటూ ఇరాన్ అధికారికంగానే ప్రకటించింది. ఇప్పటికే.. అనేక ఆర్థిక, రాజకీయ అస్థిరతలతో కుంగుబాటుకు గురవుతున్న ఇరాన్ కు ఆమెరికా ఆంక్షలు మరిన్ని ఇబ్బందుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. ట్రంప్ చర్యలతో ఇరాన్‌ కరెన్సీ భారీగా పతనమైంది. ట్రంప్ ప్రభావంతో చరిత్రలోనే రికార్డు పతనాన్ని నమోదు చేసింది. ఏకంగా ఒక్క అమెరికా డాలరు మారకరు విలువ 42 వేల రియాల్స్ చేరుకుంది. దీంతో.. ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోనుంది.


ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన ఇరాన్.. విదేశాలకు అందించే సాయాన్ని నిలుపుదల చేసిన ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇది పరోక్షంగా దాని శత్రు దేశమైన ఇజ్రాయిల్ కు సాయం నిలిచిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటనగా నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు సైతం ఇరాన్ తో చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ వంటి దేశం దగ్గర అణు బాంబులు ఉండేందుకు వీలు లేదంటున్న ఆయన.. ఓ వైపు ఆంక్షలు, మరోవైపు దౌత్య చర్చలు చేపడుతూ.. ఇరాన్ ను దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : చంద్రుడిపైకి చైనా అత్యాధునిక రోబోట్.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

ఇప్పటికే.. భారీ యూరేనియం నిల్వల్ని సిద్ధం చేసిన ఇరాన్, దాన్ని అణు బాంబుల తయారీకి కావాల్సినట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం.. ఆ దేశంలోని సెంట్రిప్యూజ్ లలో పెద్ద ఎత్తున మార్పులు చేపట్టింది. ఇప్పటికే.. 200 కేజీల 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంది. అణు బాంబులు తయారు చేయాలి అంటే 90 శాతం శుద్ధ యురేనియం అవసరం అవుతుంది. అందుకే.. సెంట్రిప్యూజ్ లలో మార్పులు చేస్తోంది. పౌర అవసరాల కోసం అయితే ఇప్పుడు ఉన్న సెంట్రిప్యూజులు కానీ, శుద్ధి చేసిన నాణ్యత కానీ సరిపోతుంది. కానీ.. అంతకు మించి శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది అంటే కచ్చితంగా అణు బాంబుల కోసమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన ఆమెరికా, ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా ఆంక్షల్ని విధించేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషిస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×