BigTV English

SCR special trains 2025: హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి స్పెషల్ రైళ్లు.. ఏపీ, తెలంగాణ మీదుగానే!

SCR special trains 2025: హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి స్పెషల్ రైళ్లు.. ఏపీ, తెలంగాణ మీదుగానే!

SCR special trains 2025: హైదరాబాద్ నుండి కన్యాకుమారి మధ్య ప్రయాణం ఇక సాఫీగా జరగనుంది. దక్షిణ భారతం వైపు వెళ్లే వారికి ఇది నిజంగా మంచి వార్త. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుంచి దక్షిణ తమిళనాడు వరకు నేరుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్లు ప్రయాణాన్ని సులభతరం చేయనున్నాయి.


ఈ ప్రత్యేక రైళ్లు జూలై 2025 నెలలో నాలుగు సార్లు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07230 – హైదరాబాద్ నుంచి కన్యాకుమారి స్పెషల్ రైలు జూలై 2, 9, 16, 23 తేదీల్లో బుధవారం రోజున సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. ఇది మూడవ రోజు తెల్లవారుజామున 2:30కి కన్యాకుమారికి చేరుకుంటుంది. తిరుగు దిశలో ట్రైన్ నంబర్ 07229 – కన్యాకుమారి నుంచి హైదరాబాద్‌ స్పెషల్ రైలు జూలై 4, 11, 18, 25 తేదీల్లో శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు బయలుదేరి, తదుపరి రోజు మధ్యాహ్నం 2:30కి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ఈ రైళ్లలో మొత్తం 2 AC టూ టైర్ కోచ్‌లు, 2 AC త్రీ టైర్ కోచ్‌లు, 18 స్లీపర్ కోచ్‌లు, 2 లగేజ్ బ్రేక్ వాన్లు ఉంటాయి. అంటే అన్ని వర్గాల ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. టికెట్లు దక్షిణ రైల్వే చివర నుండి అందుబాటులో ఉన్నాయి.


ఈ రైళ్లు ప్రయాణించే మార్గం ఎంతో విశేషంగా ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, తెనాలి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు మీదుగా తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించి, కాట్పాడి, తిరువన్నామలై, విల్లుపురం, తంజావూరు, మధురై, తిరునెల్వేలి వంటి ముఖ్యమైన పట్టణాల మీదుగా కన్యాకుమారి చేరుతుంది. ఈ మార్గంలో మొత్తం 40కి పైగా స్టేషన్లలో ఆగుతుంది. ఇది కేవలం ప్రయాణ మాధ్యమం మాత్రమే కాక, దక్షిణ భారత పర్యటనకు వెళ్లే వారికి ఒక అద్భుతమైన అవకాశం.

Also Read: Secunderabad to Visakha train: రైలు టికెట్ ధరల పెంపు.. సికింద్రాబాద్ – విశాఖ రైళ్ల కొత్త ఛార్జీలు ఇవే

ప్రయాణ సమయం మొత్తం దాదాపు 33 గంటలు. అయితే ఈ మధ్య ప్రయాణంలో పలు పర్యాటక ప్రదేశాలు కూడా వస్తాయి. తిరుపతి ఆలయం, మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం, తంజావూరు బ్రహదీశ్వర ఆలయం, కన్యాకుమారి సముద్ర స్నానం వంటి అనేక శక్తిపీఠాలు, పర్యాటక కేంద్రములు ఈ రూట్‌లో ఉన్నాయి. అలానే తూర్పు రైలు మార్గాల్లో ప్రయాణించాలనుకునే ఫోటోగ్రాఫర్లకు, ధార్మిక యాత్రికులకు ఈ ట్రైన్ ప్రయాణం ఒక అద్వితీయ అనుభవంగా మారుతుంది.

ఈ స్పెషల్ రైళ్ల రాకతో పాటు, హోటల్ బుకింగ్‌లు, టూరిస్టులకు కనెక్టివిటీ మెరుగవుతుందని స్థానికులు భావిస్తున్నారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే ట్రైన్ టైమింగ్స్ కూడా మినట్ టు మినట్ వివరాలతో ఉండటంతో ప్రయాణికులు సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు తిరునెల్వేలి నుంచి తెల్లవారుజామున 7:25కి బయలుదేరి, మధురైలో ఉదయం 9:50కి, దిండిగుల్, తంజావూరు మీదుగా, తిరుపతి చేరుకునే వరకు సమయాలను ఖచ్చితంగా పాటించేలా షెడ్యూల్ ఉంది.

ఇదే తరహా స్పెషల్ రైళ్లు ప్రతి వేసవి కాలం లేదా పండుగల సమయంలో తక్కువగా మాత్రమే నడిచేవి. కానీ ఈసారి నాలుగు నాలుగు సర్వీసులతో ప్రయాణికులకు చక్కటి అవకాశం లభించింది. టూరిస్టులకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఇంత విస్తృతంగా ప్రయాణించే ప్రత్యేక రైలు దక్కించుకోవాలంటే ముందే టికెట్ల కోసం ప్రణాళిక చేసుకోవడం మంచిది.

ఈ రైళ్లు కేవలం ప్రయాణ అవసరాలే కాదు, సాంస్కృతిక అనుభూతులకూ మార్గం చూపిస్తున్నాయి. దక్షిణ దిక్కున ఆలయాలు, ప్రకృతి, సంస్కృతి అన్నింటిని చవిచూడాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది తప్పనిసరి రైలు. చిన్న కుటుంబ యాత్రలైనా, పెద్ద టూర్స్ అయినా, ఈ రైళ్లు ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చగలవు. హైదరాబాద్ – కన్యాకుమారి స్పెషల్ రైళ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటే, వెంటనే ప్లాన్ చేసి రిజర్వేషన్ చేసుకోవడమే ఉత్తమ మార్గం!

Related News

Watch Video: రైల్లో ఏసీ ప్రాబ్లం, టెక్నీషియన్ వచ్చి చూసి షాక్..

Tirupati Hidden Places: తిరుమలలో ఈ రహస్య నీటి కొలను గురించి తెలుసా? ఫుల్‌ గా ఎంజాయ్ చేయొచ్చు!

Driverless Bus: హైదరాబాద్ విద్యార్థుల సరికొత్త ప్రయోగం.. దేశంలోనే ఫస్ట్ టైమ్.. డ్రైవర్ లెస్ బస్ రెడీ చేసేశారు!

FASTag Annual Pass: టోల్ రీచార్జ్ టెన్షన్‌కు గుడ్‌బై.. ఆగస్టు 15 నుంచి FASTag పాస్ రెడీ!

Srisailam Road Project: హైదరాబాద్‌ నుండి శ్రీశైలంకు కొత్త రూట్.. జస్ట్ 45 నిమిషాల్లో యమ స్పీడ్ దారి ఇదే!

Ganga Bridge: ఆసియాలోనే అద్భుతం.. 10 కి.మీ పొడవైన గంగా వంతెన.. ఇది వేరే లెవల్ బాస్!

Big Stories

×