SCR Maha Kumbh Mela Special Trains: ఉత్తర ప్రదేశ్ లోని మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ప్రయగరాజ్ కు చేరుకుంటున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
చర్లపల్లి నుంచి కుంభమేళా ప్రత్యేక రైలు
కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం మరో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రలర్ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు చర్లపల్లి- దానాపూర్ -చర్లపల్లి నడుమ రాకపోకలు కొనసాగిస్తుందని తెలిపింది. 07121 నెంబర్ గల ఎక్స్ ప్రెస్ రైలుఈ నెల 17న మధ్యాహ్నం 3.10 చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకోనుంది. అదే రైలు(07122) తిరుగు ప్రయాణంలో ఈ నెల 19న మధ్యాహ్నం 3.15 గంటలకు దానాపూర్ నుంచి బయల్దేరనుంది. మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది. ఇక ఈ రైల్లో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్ సహా మొత్తం 22 కోచ్ లు ఉంటాయని అధికారులు వెల్లలడించారు.
ఈ స్పెషల్ రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయంటే?
ఈ స్పెషల్ రైలు ఖాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, చంద్రపూర్, సేవగ్రామ్, నాగ్ పూర్, ఇటార్సీ, పైపరియా, జబల్ పూర్, కట్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగరాజ్, మిర్జాపూర్, బక్సర్, అరా స్టేషన్లలో రైండు వైపులా ఆగనున్నాయి.
#MahaKumbh2025 #KumbhRailSeva2025 pic.twitter.com/8CnKHmhb6Z
— South Central Railway (@SCRailwayIndia) February 14, 2025
Read Also: కుంభమేళాకు వెళ్లే తెలుగు భక్తులకు గుడ్ న్యూస్, ఆ రెండు రైళ్లకు బోగీల పెంపు!
ఈ నెల 18న మరో ప్రత్యేక రైలు
అటు తిరుపతి-దానాపూర్ రూట్ లో మరో ప్రత్యేక రైలు(07119)ను షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 18న రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుంచి బయల్దేరుతుంది. రెండు రోజుల పాటు ప్రయాణించి రాత్రి 11.55 నిమిషాల ప్రాంతంలో దానాపూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు(07120) దానాపూర్ నుంచి ఈ నెల 21న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. రెండు రోజుల తరువాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి జంక్షన్ కు చేరుకుంటుంది. ఈ రైలు కూడా రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాద్గిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ తీసకుంటుంది.
కుంభమేళా కోసం 13 వేళ రైళ్లు కేటాయింపు
ఇక 140 ఏండ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే సంస్థ దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లను నడుపుతున్నది. వీటిలో 3,100 ప్రత్యేక రైళ్లు కాగా, మిగతా 10, 000 సాధారణ రైళ్లు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: రైల్ ఇంజిన్‌లోనూ కిక్కిరిసిన ప్రయాణీకులు.. మరి ఆ రైలు ఎవరు నడుపుతారు రా బాబు!