Kollywood: వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి వాటితో హిట్లు కొట్టి గ్లోబల్ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది టాలీవుడ్. అదే రేంజ్‌లో మిగతా సౌత్ ఇండస్ట్రీలు కూడా పాపులర్ అవ్వాలని చూస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం ఇదే టార్గెట్‌గా పెట్టుకొని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కోలీవుడ్ నుండి అలా వచ్చిన ఏ పాన్ ఇండియా మూవీ కూడా వర్కవుట్ అవ్వలేదు. గత కొన్ని నెలల్లో వచ్చిన తమిళ స్టార్ హీరోల సినిమాలన్నీ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై ఒక యంగ్ ప్రొడ్యూసర్ చర్చించారు. తను మరెవరో కాదు.. ఏజీఎస్ ప్రొడక్షన్స్ ఓనర్ అర్చన కల్పతి.
బోల్డ్ కామెంట్స్
ఏజీఎస్ ప్రొడక్షన్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా గుర్తుండిపోయే తమిళ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. త్వరలోనే ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ‘డ్రాగన్’ (Dragon) మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ మూవీని ఏజీఎస్ ప్రొడక్షన్స్ (AGS Productions) నిర్మించడంతో దీని ప్రమోషన్స్‌లో నిర్మాత అర్చన కల్పతి కూడా పాల్గొంటున్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganthan), హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో పాటు ఆమె కూడా ప్రతీ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ‘డ్రాగన్’ను ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్‌లో భాగంగానే ఇటీవల కోలీవుడ్ సినిమాలు ఎందుకు వర్కవుట్ అవ్వడం లేదు అనే విషయంపై బోల్డ్ కామెంట్స్ చేశారు అర్చన.
కథ బలంగా లేదు
కొన్నిరోజుల గ్యాప్‌లోనే కోలీవుడ్ స్టార్ హీరోలు నటించిన ‘విడాముయర్చి’, ‘ఇండియన్ 2’, ‘కంగువా’ లాంటి సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఏదీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డిశాస్టర్స్‌గా నిలిచాయి. అసలు ఇలా జరగడానికి కారణమేంటి అని అర్చనకు ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా.. ‘‘ఆ సినిమాలన్నీ టెక్నికల్ పరంగా భాగానే ఉన్నా.. అవి బాక్సాఫీస్ వద్ద మేజర్‌గా ఫెయిల్ అవ్వడానికి వాటికి బలమైన కథ లేకపోవడమే కారణం. ఒక సినిమా ఫెయిల్ అయినందుకు ఫిల్మ్ మేకర్స్.. ప్రేక్షకులను నిందించకూడదు’’ అంటూ చాలా బోల్డ్‌గా మాట్లాడేశారు అర్చన కల్పతి (Archana Kalpathi).
Also Read: స్టార్ కిడ్స్‌కు పని దొరకదు.. యంగ్ హీరో స్టేట్‌మెంట్, పరిణామాలు తప్పవా.?
అదే సక్సెస్ సీక్రెట్
‘‘తమ ఫేవరెట్ స్టార్ల సినిమాలు రిలీజ్ అయేటప్పుడు ఆడియన్స్ అంతా థియేటర్లకు వెళ్లి రిలీజ్‌ను ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పెద్ద స్టార్లతో సినిమాలు చేసేటప్పుడు ఏజీఎస్ ప్రొడక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. వారితో కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే తెరకెక్కిస్తుంది’’ అంటూ తమ ట్రేడ్ సీక్రెట్‌ను బయటపెట్టారు అర్చన. ప్రస్తుతం అర్చన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను కోలీవుడ్ స్టార్ గురించి, వారి సినిమాల గురించి చాలా బోల్డ్‌గా మాట్లాడిందంటూ చాలామంది ప్రేక్షకులు తనను ప్రశంసిస్తున్నారు కూడా. ఏజీఎస్ ప్రొడక్షన్స్ చివరిగా విజయ్ హీరోగా తెరకెక్కిన ‘ది గోట్’ను నిర్మించి సక్సెస్ అందుకుంది.