Akira Nandan : డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసుడి సినిమా ఎంట్రీ గురించి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అకిరా (Akira Nandan) మాత్రం చాలా తక్కువగా బయట కనిపిస్తూ ఉంటాడు. రీసెంట్ గా అకిరా ‘ఓజి’ (OG) మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అకిరా నందన్ కొత్త లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తండ్రితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన అకిరా నందన్ మాస్ లుక్ ను మీరూ చూశారా?
రగ్డ్ లుక్ లో అకీరా నందన్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి అకిరా ఎక్కువగా బయట కనిపిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో కలిసి ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా తిరుగుతున్నారు. తాజాగా అకిరా నందన్ తన తండ్రితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి తీర్థయాత్రకి నేడు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ముందుగా కేరళ వెళ్ళిన పవన్ కళ్యాణ్, కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ అక్కడి పూజారుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ గా అకిరా
ఈ క్షేత్రం దర్శనంలో భాగంగా పవన్ కళ్యాణ్ తనతో పాటు తనయుడు అకిరా నందన్ (Akira Nandan)ను కూడా తీసుకెళ్లడం విశేషం. అలాగే పవన్ క్లోజ్ ఫ్రెండ్, టీటీడీ సభ్యుడు ఆనంద సాయి కూడా ఈ క్షేత్ర దర్శనంలో పాల్గొన్నారు. అయితే అకిరా నందన్ మాత్రం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. జనసేన సోషల్ మీడియా అధికారిక ఖాతాలో అకిరా నందన్, పవన్ అగస్త్య మహర్షి ఆలయంలో ప్రదక్షిణలు, పూజలు చేస్తున్న ఫోటోలని, వీడియోలని షేర్ చేశారు. అందులో అకిరా ఫుల్ గడ్డంతో, బాగా జుట్టు పెంచుకొని… తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్ లో కనిపించడంతో మెగా అభిమాను లు ఖుషి అవుతున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే రగ్డ్ లుక్ తో అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే అదిరిపోవడం ఖాయం అంటున్నారు.
‘ఓజీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ
గతంలో రేణూ దేశాయ్ అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు అన్నట్టుగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని రోజుల క్రితమే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ మూవీ సెట్స్ నుంచి లీకైన వీడియోలలో అకిరా నందన్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కనిపించి, సర్ప్రైజ్ చేశాడు. అయితే అఫీషియల్ గా అఖీరా నందన్ హీరోగా చేసే ఫస్ట్ మూవీ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.