స్విట్జర్లాండ్. భూలో స్వర్గంలా భావిస్తారు. అందమైన ఆల్ప్స్ పర్వతాలు, ప్రకృతి అందాలతో ఆహా అనిపిస్తుంది. పర్యాటకులకు స్వర్గధామంగా పేరు పొందింది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా గుర్తింపు తెచ్చుకున్న స్విట్జర్లాండ్ కు వెళ్లేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. భారతీయులు కూడా జీవితంలో ఒక్కసారైనా స్విట్జర్లాండ్ ను చుట్టేయాలని భావిస్తారు. అయితే, ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోయినా స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్లొచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగంటే..
స్విట్జర్లాండ్ టూర్ కు ఎంత ఖర్చు అవుతుందంటే?
ఇండియా నుంచి స్విట్జర్లాండ్ కు ఒంటరిగా లేదంటే జంటగా వెళ్లే అవకాశం కల్పిస్తున్నది బజాజ్ ఫైన్సాన్. స్విట్జర్లాండ్ టూర్ కోసం పర్సనల్ లోన్ అందిస్తున్నది. జంటలకు, రూ.3 నుంచి 4 లక్షల వరకు, ఒంటరిగా వెళ్లే వారికి 1.5 నుంచి 2 లక్షల వరకు లోన్ అందిస్తున్నది. స్విట్జర్లాండ్ లో 7 రోజుల నుంచి 10 రోజుల వరకు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీటిలో వీసా ఫీజ్, విమాన టికెట్ ఖర్చు, వసతి, భోజనం, రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ సహా పలు ఖర్చులు ఉంటాయి. వీటి కోసం బజాన్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అందిస్తున్నది.
స్విట్జర్లాండ్ వీసా ఖర్చులు, విమాన టికెట్ల ధరలు
స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. స్కెంజెన్ వీసా ధర రూ. 7,000 ఉంటుంది. బజాజ్ పర్సనల్ లోన్‌ను ఎంచుకోవడం వల్ల వీసా ఖర్చులు కవర్ అవుతాయి. ఇండియా నుంచి స్విట్జర్లాండ్ కు వెళ్లే విమాన టికెట్ల ధర ఒక్కొక్కరికి రూ. 40,000 నుంచి రూ.1,00,000 ఖర్చు అవుతుంది. ముందుగానే టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం మంచిది. ట్రావెల్ లోన్ స్విట్జర్లాండ్‌కు టిక్కెట్లు కొనడానికి ఉపయోగపడుతుంది. ఈ డబ్బులను మంత్లీ ఇన్ స్టాల్ మెంట్స్ ప్రకారం చెల్లించే అవకాశం ఉంటుంది.
స్విట్జర్లాండ్‌లో వసతి, రవాణా ఖర్చులు
స్విట్జర్లాండ్ లో వసతి ఖర్చులు, టూరిస్టులు కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకరాత్రి బస చేసేందుకు రూ. 8,000 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. స్విట్జర్లాండ్ లో రైళ్లు, బస్సులు, ట్రామ్‌లు, టాక్సీలలో ట్రావెల్ చెయ్యొచ్చు. రోజుకు రూ.1,000 నుంచి 3,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక ఫుడ్ కోసం రోజుకు రూ.1,400 నుంచి రూ. 4,000 వరకు ఖర్చు అవుతుంది.
పర్యాటక ప్రదేశాల సందర్శన ఖర్చులు
స్విట్జర్లాండ్ లో బోలెడు పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. 7–10 రోజుల సందర్శన కోసం రూ. 21,000 నుంచి రూ. 60,000 వరకు అవుతాయి. ఇందులో కేబుల్ కార్ రైడ్‌లు, అందమైన రైలు ప్రయాణాలు, హైకింగ్ లాంటి కార్యకలాపాలతో పాటుగా స్విస్ ఆల్ప్స్, లేక్ జెనీవా, మ్యూజియం సహా అన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖర్చు
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు, ట్రిప్ క్యాన్సిలేషన్, లగేజీ థెఫ్టింగ్ కు ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇందు కోసం 7-10 రోజులకు రూ. 1,000 నుంచి 2,000 వేల వరకు ఖర్చు అవుతుంది.
స్విట్జర్లాండ్ టూర్ కోసం బజాజ్ పర్సనల్ లోన్ ఎందుకు?
స్విట్జర్లాండ్ టూర్ ఇప్పుడ చేతిలో డబ్బులు లేకపోయినా వెళ్లి రావచ్చు. ఇందుకోసం బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అందిస్తుంది. ఈ టూర్ కు అవసరం అయిన అన్ని ఖర్చులను అందిస్తుంది.
⦿ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు: మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మీ లోన్ రీపేమెంట్ వ్యవధిని రూపొందించుకోవచ్చు.
⦿ స్ట్రీమ్‌లైన్డ్ అప్లికేషన్ ప్రాసెస్: కేవలం ఐదు నిమిషాల్లో మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ తాకట్టు లేని రుణాలు: స్విట్జర్లాండ్ టూర్ కోసం ట్రావెల్ లోన్ కోసం బంగారం, అసెట్స్ టాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
Read Also: ఆ ప్రయాణీకుల డీటైల్స్ ఇవ్వండి, విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశం!