BigTV English

Thailand Tour: విశాఖ నుంచి థాయ్‌లాండ్‌ ట్రిప్.. వీసా లేకుండానే చెక్కేయొచ్చు, టికెట్ కూడా చాలా చీప్ గురూ!

Thailand Tour: విశాఖ నుంచి థాయ్‌లాండ్‌ ట్రిప్.. వీసా లేకుండానే చెక్కేయొచ్చు, టికెట్ కూడా చాలా చీప్ గురూ!

Vizag To Thailand Tour: భారతీయు ఎక్కువగా ఇష్టపడే వెకేషన్ స్పాట్లలో మాల్దీవ్స్ తొలి స్థానంలో ఉండగా, మరో ప్లేస్ థాయ్ లాండ్. ల్యాండ్ ఆఫ్ స్మైల్ గా పిలిచే ఈ దేశానికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. అందమైన బీచ్ లు, దట్టమైన వర్షారణ్యాలు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను కట్టిపడేస్తాడు. ఇకపై థాయ్ లాండ్ కు వెళ్లాలనుకునే వైజాగ్ వాసులకు మరో గుడ్ న్యూస్. థాయ్ సర్కారు భారతీయులను వీసా లేకుండానే తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తోంది. అంతేకాదు, విశాఖపట్నం నుంచి నేరుగా బ్యాంకాక్‌కి  విమాన సౌకర్యం కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే విమానం ఎక్కేయండి! థాయ్ అందాలను చూసేయండి!


వీసా ప్రక్రియ

థాయిలాండ్ ప్రభుత్వం భారతీయులు వీసా లేకుండా వచ్చే విధానాన్ని నవంబర్ 2024 వరకు పొడిగించింది. ఇండియన్ టూరిస్టులు వీసా అవసరం లేకుండా 60 రోజుల వరకు థాయ్‌లాండ్‌లో ఉండచ్చు. అవసరం అయితే.. స్థానిక ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో మరో 30 రోజులు అదనంగా ఉండేందుకు పొడగించుకోవచ్చు. థాయ్ లాండ్ కు వెళ్లే వారి దగ్గర కచ్చితంగా ఇండియన్ పాస్ పోర్టు ఉండాలి. దీనిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేసి స్టాంప్ వేస్తారు.


వైజాగ్ నుంచి థాయ్ లాండ్ కు ఎలా వెళ్లాలి?

థాయ్ ఎయిర్‌ ఏషియా మంగళ, గురు, శనివారాల్లో విశాఖపట్నం నుంచి థాయ్‌ లాండ్ రాజధాని బ్యాంకాక్‌ కి నేరుగా విమానాలను నడుపుతున్నది. ఈ విమానాలు వైజాగ్ నుంచి రాత్రి 11:55 గంటలకు బయలుదేరి ఉదయం 4:20 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటాయి. ఇతర విమాన సంస్థలు కూడా థాయ్ లాండ్ కు విమానాలు నడుపుతున్నప్పటికీ, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కాల్సి ఉంటుంది.

థాయ్ లాండ్‌లో పర్యాటక ప్రదేశాలు   

⦿ చియాంగ్ మాయి

పచ్చని పర్వతాలు, అందమైన ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం. వాట్ ఫ్రా సింగ్,  వాట్ చెడి లుయాంగ్ లాంటి పురాతన దేవాలయాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఫు పింగ్ ప్యాలెస్‌ లో బస చేసే అవకాశం ఉంటుంది. వెండి పని, కుండల తయారీ, చెక్క పనులు, సాంప్రదాయ గొడుగులను తయారు చేసే గ్రామాలను సందర్శించవచ్చు. చియాంగ్ మాయి నైట్ బజార్‌ షాపింగ్ మరింత స్పెషల్. ఎలిఫెంట్ నేచర్ పార్క్‌ తప్పకుండా సందర్శించాలి.

⦿ బ్యాంకాక్

థాయ్‌ లాండ్ రాజధాని బ్యాంకాక్ అత్యంత అందమైన ప్రదేశం. ఆకాశహర్మ్యాలు చూపరులను కట్టిపడేస్తాడు.  ఐకానిక్ వాట్ అరుణ్, వాట్ ఫో, గ్రాండ్ ప్యాలెస్,  జిమ్ థాంప్సన్ హౌస్  సందర్శించవచ్చు. ఇక్కడి చతుచక్ వీకెండ్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటి. ఇక్కడ ఏకంగా 300,000 స్టాల్స్‌ ఉంటాయి.  బ్యాంకాక్ బీచ్ అందాలు చూపరులను కట్టిపడేస్తాయి.

⦿ ఫుకెట్

థాయ్ లాండ్ లో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ ద్వీపం ఫుకెట్. ఇక్కడి అద్భుతమైన బీచ్‌లు కనువిందు చేస్తాయి. సరసమైన ధరలో ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది.

⦿ ఖావో సోక్ నేషనల్ పార్క్

ప్రకృతి ప్రియులకు ఖావో సోక్ నేషనల్ పార్క్ ఒక అద్భుతమైన టూరిస్ట్ స్పాట్. అద్భుతమైన సున్నపురాయి శిఖరాలు,  జలపాతాలు ఉంటాయి.  ప్రపంచంలోని పురాతన వర్షారణ్యాలు, అందులో పులులు, ఏనుగులతో సహా వందలాది వృక్ష జాతులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

⦿ అయుతయ

ఒకప్పుడు సయామీస్ రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. ఇప్పుడు UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. అద్భుతమైన ఆలయాలకు నెలవుగా ఉంది. ఐకానిక్ ప్రాంగ్ టవర్లు,  పెద్ద మఠాలు గొప్ప చరిత్రకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి.

⦿ లాంపాంగ్

ఉత్తర థాయ్ లాండ్‌ లోని ఈ పట్టణంలో ఇప్పటికీ ప్రయాణం కోసం గుర్రపు బండ్లను ఉపయోగిస్తున్నారు. కాడ్ కాంగ్ టా, వాంగ్ నదికి సమీపంలో ఉన్న పాత వాణిజ్య ప్రాంతం ఇది. శతాబ్దాల నాటి రాట్సాడాఫిసెక్ వంతెన, చారిత్రక విశేషాలను కలిగి ఉంది. థాయ్ లాండ్ లోని అతి పొడవైన రైల్వే  ఖున్ థాన్ టన్నెల్‌ని అస్సలు మిస్ అవ్వకండి.

⦿ పాయ్, మే హాంగ్ సన్

ఇక్కడ అతి పెద్ద పర్వతాలు, పెద్ద బుద్ద విగ్రహం లాంటి ఐకానిక్ ల్యాండ్‌ మార్క్ లు ఉన్నాయి. వెదురు వంతెన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి!

⦿ ముందే ప్లాన్ చేసుకోండి:  మీరు నవంబర్ నుంచి మార్చి వరకు పీక్ సీజన్ లో టూర్ ప్లాన్ చేస్తే, బోట్ రైడ్‌ లు, సుందరమైన రైలు ప్రయాణాల కోసం ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి.

⦿ థాయ్ మర్యాదలు: స్థానికులను పలకరిస్తున్నప్పుడు, గౌరవప్రదమైన ‘వై’ సంజ్ఞను ఉపయోగించండి.

⦿ రాచరికం పట్ల గౌరవం: థాయ్ సంస్కృతి రాజకుటుంబంపై ఎక్కువ గౌరవాన్ని చూపిస్తుంది. రాచరికానికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు.

⦿ ఫుడ్: థాయ్ వంటకాలలో సాధారణంగా చేపలు,  ఓస్టెర్ సాస్‌లను ఉపయోగిస్తారు. శాకాహారులు భారతీయ శాకాహార రెస్టారెంట్ల ఫుడ్, బౌద్ధ శాఖాహారం తీసుకోవచ్చు.

⦿ రవాణా, వసతి: థాయిలాండ్ రవాణా వ్యవస్థ సుదీర్ఘ ప్రయాణాల కోసం టక్-టుక్స్ నుంచి స్లీపర్ రైళ్ల వరకు అనుకూలమైన ఎంపికలను అందిస్తుంది. బడ్జెట్ ప్రయాణీకుల కోసం బ్యాంకాక్, చియాంగ్ మాయి లాంటి ప్రదేశాల్లో  గెస్ట్‌ హౌస్‌లు అందుబాటులో ఉంటాయి.

Read Also:పెళ్లి కొడుకు ఎక్కిన రైలు లేటు.. వెంటనే రైల్వే అధికారులు ఏం చేశారో తెలుసా? మీరు ఊహించలేరు!

Related News

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

Big Stories

×