Akshay Kumar: బాలీవుడ్ లో హేరా ఫేరీ 3 మూవీ ఐకాన్ కామెడీ ఫ్రాంచైజీ లో ఒకటి. 2025 ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఫిరోజ్ నదియాద్ వాలా నుండి హక్కులను కొనుగోలు చేశారు. అయితే పరేష్ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. తాజాగా అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కు నష్టపరిహారం కోసం లీగల్ నోటీస్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
పరేష్ రావల్‌పై అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు దావా..
అక్షయ్ కుమార్ తన నిర్మాణ సంస్థ కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా పరేష్ రావెల్ కు 25 కోట్ల నష్టపరిహారం కోసం లీగల్ నోటీస్ పంపారు. పరేష్ రావెల్ ఒప్పందం కుదుర్చుకొని షూటింగ్ లో పాల్గొన్న తరువాత అకస్మాత్తుగా అయన మూవీ నుండి తప్పుకోవటం వల్ల ఆర్థిక నష్టాలు, షెడ్యూల్ ఆలస్యం జరిగినట్లు ఆరోపణలతో, పరేష్ కు నోటీసు పంపారు. అక్షయ్ కుమార్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కావడం చర్చినియంసమైంది. దర్శకుడు ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పరేష్ రావెల్ ..స్పందన ..
పరేష్ రావెల్ స్వయంగా ఈ ఆరోపణలను ఖండించారు. హేరా ఫేరీ 3 నుంచి తప్పుకోవడానికి విభేదాలు కారణం కాదని, దర్శకుడు ప్రియదర్శనితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఆయనంటే నా గౌరవం ఉంది అని ఆయన సోషల్ మీడియా వేదిక తెలిపారు. పరేష్ గతంలో ఓ మై గాడ్ 2, బిల్లు బార్బర్ నుండి తప్పుకున్నాడు అప్పట్లో ఇవి కూడా వివాదాస్పదమయ్యాయి.
దర్శకుని స్పందన ..
ఇక దర్శకుడు ప్రియదర్శని ముందుగా పరేష్ ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం ఇవ్వలేదు. అందుకే నిర్మాత అక్షయ్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమంజసమే అని ఆయన అక్షయకు మద్దతు తెలిపారు. బాలీవుడ్ లో వృత్తిపరమైన బాధ్యతపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ వివాదంతో ఈ సినిమా ఫ్రాంచైజీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అభిమానులు భావిస్తున్నారు. అభిమానులు మాత్రం చివరి నిమిషంలో అయినా మళ్లీ పరేష్ రావెల్ సినిమాకి ఒప్పుకుంటారేమో అన్న ఆశతో ఉన్నారు. ఈ వివాదం భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపిస్తుందో చూడాలి.
మూవీ సిరీస్ గురించి ..
హేరా ఫేరీ చిత్రం మొదటి భాగం 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ చిత్రం కల్టి క్లాసికల్ మూవీగా పరిగణించబడింది. ఈ మూవీ హైలెట్స్ సినిమాలో డైలాగులు పరేష్ కామెడీ, ప్రధాన అంశాలు. అప్పట్లో ఈ చిత్రం 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే 18 కోట్లు వసూలు చేసి, సంచల రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ ఉత్తమ కామెడీ మూవీ గా ఫిలింఫేర్ అవార్డులను ఐఐఎఫ్ఏ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్ తో హేరా ఫేరీ 2006లో రెండవ భాగం రిలీజ్ చేశారు ఆ మూవీ సక్సెస్ ని అందుకుంది. ఇంక ఇప్పుడు మూడో భాగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే అక్షయ్ కుమార్ పరేష్ రావల్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆయన సినిమా నుండి తప్పుకోవడంతో ఈ వివాదం నెలకొంది.