Indian Railways: భారతీయ రైల్వేలో ప్రమాదాలకు తావులేకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ‘కవచ్’ లాంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెక్నికల్ గా ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, కొంతమంది దుండగులు రైళ్లు పట్టాలు తప్పేలా కుట్రలకు తెగబడుతున్నారు. కొన్ని చోట్ల పట్టాలు తప్పేలా బోల్టులు తొలగిస్తే, మరికొందరు పట్టాల మీద ఇనుప కడ్డీలు, గ్యాస్ సిలిండర్లు, ఇసుక పోస్తున్నారు. తాజాగా రెండు రైళ్లు పట్టాలు తప్పేలా దుండగులు కుట్ర చేశారు. లోకో పైలెట్లు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదాలు తప్పాయి.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్‌లో రాజధాని ఎక్స్ ప్రెస్ తో పాటు మరో రైలు పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కుట్రలు చేశారు. కానీ, లోకో పైలెట్స్ అలర్ట్ కావడంతో భారీ ప్రమాదాలు తప్పాయి. దలేల్ నగర్- ఉమర్ తాలి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పేలా కొంత మంది ఆగంతకులు కుట్రలు చేశారు. పట్టాలకు ఎర్తింగ్ వైర్ ను ఉపయోగించి చెక్క పలకలు కట్టారు. రైలు పట్టాలు తప్పేలా అడ్డంకులు సృష్టించారు. ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ కు వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లోకో పైలట్లు అలర్ట్ అయ్యారు. ట్రాక్ కు అడ్డుగా ఉన్న పలకలను గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. రైలు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు కాఠ్ గోదామ్ ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు తప్పిచేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కుట్రలు చేశారు. ఈ రైలు నడిపే లోకో పైలెట్లు కూడా ముందున్న ప్రమాదాన్ని గుర్తించడంతో పెను ముప్పు తప్పింది.
Read Also: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఇదే, ఏ రూట్ లో నడుస్తుందంటే?
రెండు ఘటనపై ఉన్నతాధికారుల విచారణ
రెండు రైళ్లు పట్టాలు తప్పేలా కుట్రలు చేసిన విషయం వెలుగులోకి రావడంతో రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు. సంఘటనా స్థలాలకు చేరుకుని జీఆర్‌పీ, ఆర్‌పీ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మెయింటెనెన్స్ సిబ్బంది నుంచి వివరాలను సేకరించారు. అటు వెంటనే ట్రాక్ లను క్లియర్ చేయడంతో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. రైల్వే పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని వెల్లడించారు. పట్టాలు తప్పేలా కుట్రలు చేసే వారిపై రైల్వే చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Also: తిరుపతికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఏపీలోని ఆ నగరం నుంచి వందేభారత్!