Plane Crashes in India: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు, 20 మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతిచెందారు. ప్రమాదంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగీస్ దేశీయులు, ఒక కెనడయన్ ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే మృతుల్లో ఇద్దరు శిశువులు, సహా 13 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం విజయ్ విజయ్ రూపానీ కూడా మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.
అయితే, ఇంతకుముందు కూడా భారతదేశంలో విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. 2020లో కోజికోడ్ విమాన ప్రమాదం, 2010లో మంగళూరు ప్రమాదం, 1998లో పాట్నా విమాన ప్రమాదం, 1996లో చర్ఖి- దాద్రి ప్రమాదం, 1993లో ఔరంగాబాద్ ప్రమాదం, 1990లో బెంగళూరు ప్రమాదం, 1988లో అహ్మదాబాద్ ప్రమాదం జరిగింది.
2020లో కోజికోడ్ ప్రమాదం..
దేశ విమానయాన విపత్తులలో అత్యంత విషాదకర ఘటనగా కోజికోడ్ ప్రమాదం మిగిలిపోయింది. ఈ ప్రమాదం 2020, ఆగస్టు 7న జరిగింది. ప్రమాదంలో 23 మంది చనిపోయారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి బోయింగ్ 737- 800 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే.. భారీ వర్షం, లో విజిబిలిటీ వల్ల కోజికోడ్ టేబుల్ టాప్ రన్‌వే వద్ద దిగడానికి ప్రయత్నించింది. కానీ, రన్‌వేని దాటి 30 అడుగుల లోయలో పడి రెండు విభాగాలు విరిగిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోయారు.
ALSO READ: Plane Crash: భోజనం చేస్తుండగా.. కాలేజ్ హాస్టల్‌పై కూలిన విమానం.. ఆ డాక్టర్ల పరిస్థితి ఏమిటి?
2010 మంగళూరు ప్రమాదం..
ఇది 2010 మే 22న జరిగింది. మంగళూరు ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 166 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో 158 మంది మృతిచెందగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.
1998 పాట్నా ప్రమాదం..
బీహార్ లోని పాట్నా ఎయిర్ పోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. 1998 జూలై 17న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 విషాదకరంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు, నేలపై ఉన్న ఐదుగురు స్థానిక ప్రజలు మృతిచెందారు.
1996లో ఛర్ఖి – దాద్రి ప్రమాదం..
ఇది విమానయాన విపత్తులలో అత్యంత విషాదకర ఘటన. హర్యానాలోని చర్ఖి – దాద్రి సమీపంలో గాలిలో రెండు విమానాలు ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 349 ప్రయాణికులు మృతిచెందారు. సమాచారం లోపం కారణంగా.. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ విమానం 763, కజకిస్థాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 1907 గాలిలోనే ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ALSO READ: Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు
1993 ఔరంగాబాద్ ప్రమాదం
మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. 1993 ఏప్రిల్ 26న బోయింగ్ 737 -2ఏ8 విమానం.. టేకాఫ్ రోల్ సమయంలో అనుకోకుండా రన్ వేలోకి ప్రవేశించిన ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మృతిచెందారు.
1990 బెంగళూరు ప్రమాదం..
బెంగళూరు లో హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ కూలిపోయింది. 1990 ఫిబ్రవరి 14న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 92 మంది చనిపోయారు.
1988 అహ్మదాబాద్ ప్రమాదం..
1988 అక్టోబర్ 19న ఈ ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం 113 అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలింది. లో విజబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మాత్రమే ఈ ప్రమాదంలో బతికారు.